దాని కోసం ఏమైనా చేస్తావ్: కనేరియాపై నిప్పులు చెరిగిన మియాందాద్

By telugu teamFirst Published Dec 28, 2019, 5:12 PM IST
Highlights

హిందువును కావడం వల్ల పాకిస్తాన్ జట్టులో తాను వివక్షను ఎదుర్కున్నానని చెప్పిన డానిష్ కనేరియాపై జావెద్ మియాందాద్ నిప్పులు చెరిగారు. కనేరియా పాకిస్తాన్ పరువును తీసిన క్రికెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు.

కరాచీ: తాను అంతర్జాతీయ క్రికెట్  ఆడినప్పుడు పాకిస్తాన్ జట్టులో వివక్షను ఎదుర్కున్న మాట వాస్తవమేనని చెప్పిన డానిష్ కనేరియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ నిప్పులు చెరిగారు. అతను ఓ నీతి లేని క్రికెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇప్పుడు ఏం సాధించడానికి ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన ప్రశ్నించారు. డబ్బుల కోసమే కనేరియా ఆ పనిచేసి ఉంటాడని ఆయన మండిపడ్డారు. డబ్బుల కోసం కనేరియా ఏదైనా చేస్తాడని వ్యాఖ్యానించారు. ఎప్పుడో ముగిసిన సంఘటనను ఇప్పుడు ఎందుకు తెర మీదికి తెచ్చారో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

Also Read: మేం అజర్ ను కెప్టెన్ చేశాం, పాక్ రియల్ ఫేస్: కనేరియా ఇష్యుపై గంభీర్

"కనేరియా... నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు. నువ్వు విలువలు లేని క్రికెటర్ వి. క్రికెట్ లో ఫిక్సింగ్ కు పాల్పడిన ఓ క్రికెటర్ మాటలు ప్రజలు ఎలా నమ్ముతారో తనకు అర్థం కావడం లేద"ని ఆయన అన్నారు. కనేరియా దేశం పరువును తీశాడని మండిపడ్డారు. 

తాను 2000 సంవత్సరానికి ముందు పాకిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నానని, అప్పుడు కనేరియా జట్టులోనే ఉన్నాడని, ఆ సమయంలో కనేరియాను అవమానించిన ఏ ఒక్క సంఘటనను కూడా తాను చూడలేదని ఆయన అన్నారు. హిందువు అనే వివక్షను కనేరియా పట్ల ప్రదర్శించలేదని స్పష్టంచేశారు. 

Also Read: పాక్ నా జన్మభూమి, అందుకు గర్విస్తున్నా: వివక్షపై కనేరియా

తనను అవమానపరిస్తే పదేళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఎలా కొనసాగాడో తెలియడం లేదని, పాకిస్తాన్ కనేరియాకు చాలా గౌరవం ఇచ్చిందని మియాందాద్ చెప్పారు. 

click me!