మేం అజర్ ను కెప్టెన్ చేశాం, పాక్ రియల్ ఫేస్: కనేరియా ఇష్యుపై గంభీర్

By telugu teamFirst Published Dec 28, 2019, 4:47 PM IST
Highlights

పాకిస్తాన్ క్రిెకెట్ జట్టులో వివక్షను ఎదుర్కున్న డానిష్ కనేరియా సంఘటనపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. తాము అజరుద్దీన్ వంటి వారిని చాలా కాలం టీమిండియా కెప్టెన్ గా కొనసాగించామని చెప్పారు.

న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని హిందూ క్రికెటర్ డానిష్ కనేరియా వివాదంపై టీమిండియా మాజీ ఆటగాడు, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. డానిష్ కనేరియా పట్ల ప్రవర్తించిన తీరుపై ఆయన తీవ్్రంగా మండిపడ్డారు. అది పాకిస్తాన్ అసలు రంగును బయటపెడుతుందని ఆయన అన్నారు. 

లెగ్ స్పిన్నర్ కనేరియా పాకిస్తాన్ కు ఎన్నో విజయాలను అందించాడని, అయినప్పటికీ హిందువు కావడం వల్ల అతని పట్ల పాకిస్తాన్ క్రికెటర్లు వివక్ష ప్రదర్శించేవారని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వెల్లడించిన విషయం తెలిసిందే. కనేరియా 65 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడని, అయినా అతడి పట్ల అనమానుషంగా ప్రవర్తించడం సిగ్గు చేటు అని గంభీర్ అన్నారు. 

Also Read: పాక్ నా జన్మభూమి, అందుకు గర్విస్తున్నా: వివక్షపై కనేరియా

తాము మొహమ్మద్ అజరుద్దీన్ ను క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా నియమించుకున్నామని, చాలా కాలం అజర్ కెప్టెన్ గా ఉన్నాడని ఆయన చెప్పారు కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్ వంటివారికి భారత్ ఎంతో గౌరవం ఇచ్చిందని ఆయన అన్నారు. దేశం గర్వించే విధంగా తామంతా కలిసికట్టుగా ఆడామని చెప్పారు. నిజానికి పటేల్ తనకు మంచి మిత్రుడని ఆయన చెప్పుకున్నారు.

పాకిస్తాన్ నుంచి వస్తున్న వార్తలు దురదృష్టకరమని, అయినా పాకిస్తాన్ అసలు రంగు అదేనని ఆయన అన్నారు ఒక్క ఆటగాడికే ఆ విధమైన పరిస్థితి ఎదురైతే పాకిస్తాన్ లోని ఇతర మైనారిటీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని ఆయన అన్నారు.

Also Read: భోజనం వేళ వివక్ష, అక్తర్ వ్యాఖ్యలు: ఎవరీ డానిష్ కనేరియా?

క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న పాకిస్తాన్ లో ఓ ఆటగాడి పట్ల అమానుషంగా వ్యవహరించడం చూస్తున్నామని ఆయన అన్నారు. 

click me!