మీరే ఆడుకుంటే.. మేమంతా ఏమవ్వాలి: గంగూలీపై పాక్ మాజీ కెప్టెన్ ఫైర్

By Siva KodatiFirst Published Dec 25, 2019, 8:46 PM IST
Highlights

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల అగ్రశ్రేణి జట్లతో సూపర్ సిరీస్ నిర్వహించాలని చేసిన ప్రతిపాదనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మండిపడ్డారు. 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల అగ్రశ్రేణి జట్లతో సూపర్ సిరీస్ నిర్వహించాలని చేసిన ప్రతిపాదనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మండిపడ్డారు. సౌరవ్ ప్రతిపాదించిన (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, మరో అగ్రశ్రేణి జట్టు) టోర్నమెంట్ శుభవార్త కాదని లతిఫ్ ఎద్దేవా చేశారు.

Also Read:సచిన్‌కు భద్రతను తొలగించిన ఉద్ధవ్ ప్రభుత్వం, ఆదిత్యకు మాత్రం

ప్రత్యేకంగా ఈ నాలుగు దేశాలతోనే సిరీస్‌లు నిర్వహించడం వల్ల మిగిలిన ఐసీసీ సభ్యదేశాలను ఈ దేశాలు విస్మరించినట్లు అవుతుందని రషీద్ వ్యాఖ్యానించారు. గతంలో తీసుకువచ్చిన బిగ్ త్రి అనేది ఒక చెత్త ఆలోచనగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:నన్ను నడిపించే నా కోచ్.. కొడుకే: కుమారుడితో ధావన్ ఆట, వీడియో వైరల్

కాగా 2021లో ప్రారంభమయ్యే నాలుగు దేశాల సూపర్ సిరీస్‌ మొదటగా భారత్‌లో జరగనున్నట్లు సౌరవ్ పేర్కొన్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్లు టోర్నికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆసీసీ బోర్డు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.

దాదా ప్రతిపాదనపై స్పందించిన ఇంగ్లీష్ బోర్డు.. తాము ప్రధాన క్రికెట్ దేశాల అధికారులతో తప్పకుండా కలుస్తామని.. క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ టోర్నీపై ఇతర ఐసీసీ సభ్య దేశాలతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇంగ్లాండ్ తెలిపింది. 

click me!