ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం... పీసీబీ సంచలన నిర్ణయం

Siva Kodati |  
Published : Apr 27, 2020, 07:43 PM ISTUpdated : Apr 27, 2020, 07:45 PM IST
ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం... పీసీబీ సంచలన నిర్ణయం

సారాంశం

పాకిస్తాన్ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వేటు వేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని యాంటీ కరప్షన్ కోడ్‌లోని 2.4.4 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను అతనిపై మూడేళ్ల పాటు నిషేధం విధించింది

పాకిస్తాన్ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వేటు వేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని యాంటీ కరప్షన్ కోడ్‌లోని 2.4.4 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను అతనిపై మూడేళ్ల పాటు నిషేధం విధించింది.

వాస్తవానికి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఐదో ఎడిషన్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే అవినీతి ఆరోపణలతో ఉమర్‌ను పీసీబీ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై జస్టిస్ ఫజల్ ఈ మిరాన్ చౌహాన్ నేతృత్వంలోని క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపింది.

Also Read:లాక్‌డౌన్‌తో ఎంజాయ్ చేస్తున్న ధోనీ: బైక్‌పై కూతురితో మిస్టర్ కూల్ చక్కర్లు

దీనిలో భాగంగా అన్ని ఫార్మాట్ల నుంచి అక్మల్‌‌ను మూడేళ్ల పాటు నిషేధిస్తూ ఈ ప్యానెల్ నిర్ణయం తీసుకుంది. 29 ఏళ్ల ఉమర్ అక్మల్ గతేడాది చివరిసారిగా శ్రీలంకలో జరిగిన టీ20లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

2009లో అరంగేట్రం చేసిన అతను 11 ఏళ్ల తన కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20 ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 3 సెంచరీలు చేశాడు. మరోవైపు ఉమర్ అక్మల్‌తో పాటు పలువురు వివాదాస్పద  క్రికెటర్లపై పీసీబీ అవినీతి విభాగం ఎప్పటి నుంచో నిఘా ఉంచుతోంది.

Also Read:ఐపీఎల్ వల్ల నాకు అవకాశం రాలేదు.. యూవీతో బుమ్రా

పలువురు క్రికెటర్ల పోన్లను కూడా ట్యాప్ చేస్తోంది. గతంలో ఉమర్‌ను మూడు, నాలుగు రోజుల పాటు పరిశీలించిన తర్వాతే అతనిపై వేటు వేయాలని నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం బుకీని కలిసిన విషయాన్ని దాచిపెట్టడంతో ఉమర్‌ను ఇక ఉపేక్షించకుండా, అతనిపై చర్యలు తీసుకున్నారు.

మరోవైపు క్రికెటర్లు ఇలా చెడ్డదారుల వైపు వెళ్లడానికి బోర్డు వైఫల్యమే కారణమని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !