T20 World cup: బయో బబుల్ పై రవిశాస్త్రి కామెంట్స్ కి.. బాబర్ సపోర్ట్..!

By telugu news teamFirst Published Nov 10, 2021, 11:13 AM IST
Highlights

ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చివరి మ్యాచ్ తర్వాత... కోహ్లీ.. కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. నమీబియాతో జరిగే మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, ఈ చివరి మ్యాచ్‌‌తో భారత్ ప్రయాణం కూడా ముగిసిపోయింది.

T20 worldcup లో  టీమిండియా పోరాటం ముగిసింది. మరో వైపు పాకిస్తాన్ మాత్రం వరస మ్యాచుల్లో విజయం సాధిస్తూ... ముందుకు సాగుతోంది. ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చివరి మ్యాచ్ తర్వాత... కోహ్లీ.. కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. నమీబియాతో జరిగే మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, ఈ చివరి మ్యాచ్‌‌తో భారత్ ప్రయాణం కూడా ముగిసిపోయింది.

కెప్టెన్‌గా ఈ టోర్నీ తనకు చివరి టీ20 అసైన్‌మెంట్ అని విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. అదే సమయంలో కోచ్ రవిశాస్త్రి ప్రతి ఫార్మాట్‌లో తన పదవిని వదులుకుంటున్నాడు. ఆ తర్వాత రవిశాస్త్రి బయో బబుల్ పై విమర్శలు చేశాడు.  కాగా..  రవిశాస్త్రి చేసిన కామెంట్స్ పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ స్పందించాడు. రవిశాస్త్రి కామెట్స్ బాబర్ మద్దతు తెలిపాడు.

Sometimes the most productive thing you can do is relax. 🧘 pic.twitter.com/gKgJv6PWif

— Babar Azam (@babarazam258)

ఇంతకీ రవిశాస్త్రి ఏమన్నాడంటే... ఆటగాళ్లు కేవలం మనుషులు మాత్రమే యంత్రాలు కాదు. పెట్రోల్‌ పోసి మెషిన్‌ను నడపవచ్చు, కానీ వీరంతా మనుషులే, యంత్రాలు కాదు. దాదాపు 6 నెలల నుంచి బయో బబుల్‌లో ఉన్నారు. నిరంతరం క్రికెట్ ఆడుతున్నారు. ప్రపంచకప్‌కు ఏటీం అయినా తాజాగా ఉండాలని కోరుకుంటుంది. కానీ, భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదు. టోర్నీని షెడ్యూల్ చేయడానికి ముందు ఐసీసీ ఈ ఆలోచన చేసి ఉండాల్సింది’ అని ఆగ్రహించారు.

Also Read: India vs New zealand:టీమిండియా టీ20 జట్టులో వెంకటేష్ అయ్యర్ కి చోటు.. ట్విట్టర్ లో ప్రశ్నలు..!

“గత ఐదేళ్లలో మేం అద్భుతమైన క్రికెట్‌ ఆడామని రవిశాస్త్రి తెలిపాడు. 70 ఏళ్లలో ఏ ఆసియా జట్టు కూడా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవలేదు. అక్కడ రెండుసార్లు సిరీస్‌ గెలిచాం. మనం చేసింది ఎవరూ చేయలేకపోయారు. ఆస్ట్రేలియాలో గెలిచాం, ఇంగ్లండ్‌లో గెలిచాం, దక్షిణాఫ్రికాలో గెలిచాం. ఈ బృందం చాలా దూరం వెళ్తుందని” ఆయన తెలిపారు.

Also Read: టీమిండియాలో గ్రూపులు.. అందుకే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.. పాక్ మాజీ క్రికెటర్..!

కాగా.. రవిశాస్త్రి చేసిన కామెంట్స్ పై బాబర్ అజామ్ ఏమన్నాడంటే...  ప్రొఫెషనల్ క్రికెట్ లో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయని బాబర్ పేర్కొన్నాడు. ఎక్కువ కాలం బయో బబుల్ లో ఉండటం వల్ల  ఆటగాళ్లు ఇబ్బంది పడతారని..  అసౌకర్యంగా ఉంటారని బాబర్ పేర్కొన్నారు.

"మేము ఒక సమూహంగా పని చేయడం ద్వారా మరియు పాకిస్తాన్ జట్టులో ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించడం ద్వారా దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాము" అని అతను చెప్పాడు.

గత ఏడాది నుంచి ఆటగాళ్లు నిరంతరం పరివేష్టిత వాతావరణంలో ఉండడం అంత సులభం కాదని పాకిస్థాన్ కెప్టెన్ చెప్పాడు. COVID-19 మహమ్మారి బలవంతంగా అంతరాయాలు ఏర్పడినప్పటి నుండి బయో-బుడగలు ఒక ప్రమాణంగా మారాయి.

click me!