India vs New zealand:టీమిండియా టీ20 జట్టులో వెంకటేష్ అయ్యర్ కి చోటు.. ట్విట్టర్ లో ప్రశ్నలు..!

Published : Nov 10, 2021, 10:26 AM ISTUpdated : Nov 10, 2021, 10:31 AM IST
India vs New zealand:టీమిండియా టీ20 జట్టులో వెంకటేష్ అయ్యర్ కి చోటు.. ట్విట్టర్ లో ప్రశ్నలు..!

సారాంశం

టి20 ప్రపంచకప్‌లో ఆడిన శార్దుల్‌ ఠాకూర్, రాహుల్‌  చహర్‌లను కూడా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కోహ్లి, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలకు వారి కోరిక మేరకు విశ్రాంతి ఇచ్చారు. 

T20 worldcup నుంచి టీమిండియా నిష్క్రమించింది. ఆ వెంటనే.. టీ 20 కెప్టెన్సీ నుంచి  విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికారు.  తాను కేవలం జట్టు సభ్యుడిగా కొనసాగుతానని చెప్పడం గమనార్హం. కోహ్లీ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్న వెంటనే.. ఆ పదవిని రోహిత్ శర్మకు  అప్పగించారు.  రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న వెంటనే.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో తలపడేందుకు సిద్ధమౌతోంది. 

టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించడం... ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఉండటంతో మంగళవారం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టి20 ప్రపంచకప్‌ బరిలో దిగిన 15 మంది జట్టులో ఏడుగురు మాత్రమే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు. ఫిట్‌నెస్‌ సమస్యలు.. ఫామ్‌లో లేకపోవడం కారణంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిలపై సెలెక్టర్లు వేటు వేశారు. 

టి20 ప్రపంచకప్‌లో ఆడిన శార్దుల్‌ ఠాకూర్, రాహుల్‌  చహర్‌లను కూడా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కోహ్లి, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలకు వారి కోరిక మేరకు విశ్రాంతి ఇచ్చారు. శ్రేయస్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్‌ పటేల్, దీపక్‌ చహర్, హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌లకు మళ్లీ పిలుపు వచ్చింది.  

 

ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), హర్షల్‌ పటేల్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), అవేశ్‌ ఖాన్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది.

అయితే.. ఈ జట్టులో.. వెంకటేష్ అయ్యర్ కి చోటు ఇవ్వడం పట్ల ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురుస్తోంది. వెంకటేష్ అయ్యర్.. ని జట్టులో  ఏ స్థానంలో దింపుతారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వెంటకేష్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ప్రవేశపెడతారా లేదంటే.. లేదంటే.. లాస్ట్ ఆర్డర్ లో ప్రవేశపెడతారా అని ప్రశ్నిస్తున్నారు.

తాము వెంకటేష్ అయ్యర్ నుంచి చాలా ఎక్కువగా ఆశిస్తున్నామని మరికొందరు ట్వీట్  చేయడం గమనార్హం. మరికొందరేమో... వెంకటేష్ అయ్యర్.. గొప్ప ఫినిషర్ కాదు అని.. అతనిని ఎలా ఎంపిక చేసుకున్నారంటూ విమర్శలు చేయడం గమనార్హం. సరైన ఫినిషర్ ఒక్కరిని కూడా సరిగా సెలక్ట్ చేయలేదని కొందరు విమర్శించడం గమనార్హం. వెంకటేష్ అయ్యర్ గొప్ప.. ఓపెనర్ అయినప్పటికీ.. గొప్ప ఫినిషర్ అయితే కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?