Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
Pakistan vs Bangladesh: పాకిస్తాన్ కు ఘోర అవమానం జరిగింది. అది కూడా స్వదేశంలో.. దీంతో పాకిస్తాన్ క్రికెట్ చచ్చిపోయింది అంటూ పాక్ ప్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులతో రెచ్చిపోతున్నారు. పాక్ ప్లేయర్లు క్రికెట్ ఆడటం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా?.. పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు రావల్పిండి వేదికగా టెస్టు మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో పాకిస్తాన్ జట్టును అభిమానులు టార్గెట్ చేశారు.
బంగ్లాదేశ్ కు పాక్ పై తొలి విజయం కాగా, స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి దేశంగా కూడా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాక్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ముష్ఫికర్ రహీమ్ (191 పరుగులు) సూపర్ ఇన్నింగ్స్ తో పాటు మెహదీ హసన్ మిరాజ్ (5 వికెట్లు-77 పరుగులు) ఆల్ రౌండ్ షో తో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఇప్పుడు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
undefined
భారత క్రికెట్ లో అత్యంత దురదృష్టవంతులు.. ఒకే మ్యాచ్ తో కెరీర్ ను ముగించింది వీరే
రిజ్వాన్-షకీల్ సెంచరీలు వృథా..
ఈ మ్యాచ్‌లో ఓడిపోతుందని పాకిస్థాన్ కలలో కూడా ఊహించలేదు.. కానీ ముష్ఫికర్ రహీమ్, మెహదీ హసన్ మిరాజ్ ఆతిథ్య జట్టుకు పీడకలగా మారారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహ్మద్ రిజ్వాన్ (171 నాటౌట్), సౌద్ షకీల్ (141 పరుగులు) సెంచరీలతో 448/6 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రతిస్పందనగా, బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ 565 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 117 పరుగుల ఆధిక్యం లభించింది. చివరి రోజు మహ్మద్ రిజ్వాన్ (51 పరుగులు), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (37 పరుగులు) మినహా పాక్ బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆడలేదు. మెహదీ హసన్ (4 వికెట్లు), షకీబ్ అల్ హసన్ (3 వికెట్లు)ల సూపర్ బౌలింగ్ తో పాక్ రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆలౌట్ అయింది.
దీంతో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌కు 30 పరుగుల టార్గెట్ ను మాత్రమే ఇవ్వగలిగింది. బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో జకీర్ హసన్, షాద్‌మన్ ఇస్లాంలు నాటౌట్‌గా మ్యాచ్ ను గెలిపించారు. సెంచరీతో అదరగొట్టిన ముష్ఫికర్ రహీమ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ తొలిసారి టెస్టులో గెలిచింది. రెండు దేశాల మధ్య 14 టెస్ట్ మ్యాచ్‌లు జరగగా, అందులో పాకిస్తాన్ 12 సార్లు గెలుపొందగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించడంతో పాటు, బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా కూడా నిలిచింది. ఇంతకు ముందు స్వదేశంలో జరిగిన టెస్టులో పాకిస్థాన్‌ను ఎవరూ 10 వికెట్ల తేడాతో ఓడించలేకపోయారు.
నా జీవితంలో అవే అత్యంత బాధకరమైన క్షణాలు.. కేఎల్ రాహుల్