టీమిండియాతో మ్యాచ్ కావాలి: మ్యాచ్ మధ్యలో పాక్ అభిమానుల గోల

By Siva KodatiFirst Published Feb 23, 2020, 5:41 PM IST
Highlights

పాక్ క్రికెట్ అభిమానులు మాత్రం భారత జట్లు తమ దేశ పర్యటనకు రావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగంగా అక్కడి అభిమానులు ఫ్లకార్డుల ద్వారా తమ కోరికను వెల్లడించారు.

క్రికెట్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా, అవి ఎంతగా ఆకట్టుకున్నా భారత్-పాక్ మ్యాచ్‌ ఇచ్చే మజానే వేరు. నరాలు తెగే ఉత్కంఠ, ఉద్వేగం. ఇందుకోసం ఇరుదేశాల అభిమానులే కాదు, క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు.

క్రికెట్ స్టేడియంలో ఉన్నామా... యుద్ధ భూమిలో ఉన్నామా అన్నట్లుగా క్రికెటర్లు పోరాడతారు. అయితే భారత్-పాక్‌ల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడం లేదు.

Also Read:బంతి కాదు, టోపీ బౌండరీ వెలుపలికి...: ఒడిసిపట్టేందుకు వెంటపడిన విలియమ్సన్

చివరిసారిగా 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగింది. కేవలం ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో మాత్రమే దాయాదులు తలపడుతున్నారు. టీమిండియాతో ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ బీసీసీఐ నుంచి సానుకూల స్పందన రావడం లేదు.

అయితే పాక్ క్రికెట్ అభిమానులు మాత్రం భారత జట్లు తమ దేశ పర్యటనకు రావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగంగా అక్కడి అభిమానులు ఫ్లకార్డుల ద్వారా తమ కోరికను వెల్లడించారు.

Also Read:బుమ్రాను విమర్శిస్తున్నవారికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన ఇషాంత్!

‘‘we want india here ’’ అనే ఫ్లకార్డులు పట్టుకుని హల్ చల్ చేశారు. దీనిని అక్కడి మీడియా కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ఇటీవల షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది సైతం టీమిండియా తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

click me!