వన్స్ మోర్ ప్లీజ్... గంగూలీకి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రిక్వెస్ట్

By telugu teamFirst Published Jan 4, 2020, 12:10 PM IST
Highlights

భారత్-పాకిస్థాన్ మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించాలని కోరిన రషీద్ లతీఫ్... ఆ సత్తా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మాత్రమే ఉందని ఈ పాక్ మాజీ కెప్టెన్ అన్నాడు. 

ముంబై: భారత్ పాకిస్థాన్ మధ్య క్షీణిస్తున్న దౌత్య సంబంధాల ఎఫెక్ట్ క్రికెట్ మీద కూడా పడింది. ఒకానొక స్టేజిలో భారత్ పాకిస్థాన్ తో ప్రపంచ కప్ లో ఆడొద్దని గంభీర్ వంటి క్రికెటర్లు డిమాండ్ చేసారు కూడా. ఇలా క్రికెట్  సంబంధాలు క్షీణిస్తున్న వేళ... వాటిని పునరుద్ధరించడానికి గంగూలీ ఒక ఆశాకిరణం లా కనబడుతున్నది పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. 

భారత్-పాకిస్థాన్ మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించాలని కోరిన రషీద్ లతీఫ్... ఆ సత్తా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మాత్రమే ఉందని ఈ పాక్ మాజీ కెప్టెన్ అన్నాడు. 

భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ల నిర్వహణ విషయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని గంగూలీని కోరాడు. ఇలా మ్యాచులు నిర్వహించడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు. ఇలా మ్యాచులు నిర్వహించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ‘సాయం’ చేయాలని గంగూలీని అభ్యర్థించాడు రషీద్ లతీఫ్. 

Also read; హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం: నటాషా మాజీ ప్రియుడి స్పందన ఇదీ...
 
గంగూలీ చొరవను గుర్తు చేస్తూ..ఒక పత్తియా సంఘటనను ఊటంకించాడు లతీఫ్. 2004లో పాకిస్థాన్ టూర్‌కు బీసీసీఐ అయిష్టంగా ఉన్నప్పటికీ, అప్పటి భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గంగూలీ, ప్రభుత్వాన్ని ఒప్పించి మ్యాచులు జరిగేలా చూశాడని కొనియాడాడు. 

ఓ క్రికెటర్‌గా, బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ, పీసీబీకి  ‘సాయం’ చేయగలడని ఈ మాజీ వికెట్ కీపర్ అభిప్రాయపడ్డాడు. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరగాలని...లేని పక్షంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. 

కేవలం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా... యావత్ ప్రపంచం కూడా భారత్, పాకిస్థాన్ లు ఆడాలనే కోరుకుంటున్నాయని చెప్పుకొచ్చాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్  

ఇతర దేశాలు పాకిస్థాన్ లో పర్యటించకపోవడంపై కూడా రషీద్ లతీఫ్ స్పందించాడు. ఇతర దేశాలు గనుక పర్యటనలకు రాకపోతే పాకిస్థాన్ క్రికెట్ మరింత దిగజారిపోయి ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.

Also read; రోహిత్ కి అరుదైన గౌరవం.. ఆయన పేరిట క్రికెట్ స్టేడియం 

క్రికెట్ ఆడే ఇతర దేశాలతో చర్చలు జరిపి పాకిస్థాన్‌లో పర్యటనకు ఒప్పించాలని, ఆ దిశగా కృషి చేయాలని పీసీబీ సీఈవో వాసిం ఖాన్‌ను సైతం రషీద్ లతీఫ్ కోరాడు. ఈ విషయంలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించాడు. అదే జరిగితే పాకిస్థాన్ క్రికెట్‌కు, స్థానిక ఆటగాళ్లకు ఎంతో మేలు జరుగుతుందని లతీఫ్ ఆశాభావం వ్యక్తం చేసాడు. 

click me!