NZ vs SA: పద్దెనిమిదేండ్ల అనంతరం దక్షిణాఫ్రికాను ఓడించిన కివీస్.. ఎల్గర్ సేనకు ఘోర అవమానం

Published : Feb 19, 2022, 12:28 PM ISTUpdated : Feb 19, 2022, 12:31 PM IST
NZ vs SA:  పద్దెనిమిదేండ్ల అనంతరం దక్షిణాఫ్రికాను ఓడించిన కివీస్.. ఎల్గర్ సేనకు ఘోర అవమానం

సారాంశం

New Zealand vs South Africa 1st Test: ఇప్పటివరకూ ఈ రెండు జట్ల మధ్య 46 టెస్టులు జరిగాయి.  ఇందులో ప్రొటీస్ జట్టు 25 టెస్టులు గెలువగా.. కివీస్ గెలిచిన మ్యాచులు మాత్రం..

ఇటీవలే టీమిండియాతో స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్ ను 2-1 తేడాతో నెగ్గిన  సౌతాఫ్రికా జట్టుకు న్యూజిలాండ్ భారీ షాకిచ్చింది. న్యూజిలాండ్ లో ఆ దేశంతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా.. తొలి టెస్టులో  దక్షిణాఫ్రికాకు భారీ పరాభావం ఎదురైంది. కివీస్ బౌలర్ల ధాటికి  ప్రోటీస్ ఆటగాళ్లు నిలబడలేకపోయారు. ఫలితంగా ఇన్నింగ్స్ ఓటమిని  మూటగట్టుకుని అవమానకర ఓటమి ఎదుర్కుంది ఎల్గర్ సేన.. 2004 తర్వాత దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ చేతిలో ఓడటం (టెస్టులలో) ఇదే ప్రథమం కావడం గమనార్హం. గురువారం ఈ టెస్టు ప్రారంభం  కాగా.. రెండున్నర రోజుల్లోనే ముగించింది న్యూజిలాండ్.. 

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా కు తొలి టెస్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. క్రైస్ట్ చర్చ్ లో ముగిసిన తొలిటెస్టులో దక్షిణాఫ్రికా.. 276 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్ వెటరన్  సీనియర్ టిమ్ సౌథీ..  ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో సౌతాఫ్రికా.. 41 ఓవర్లు మాత్రమే ఆడి ఆలౌట్ అయింది. 

 

తొలి టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న  న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 95 పరుగులకే ఆలౌట్ చేసింది.  జుబైర్  హమ్జా (25) మినహా.. ఆ జట్టు బ్యాటర్లంతా విఫలమయ్యారు.  కివీస్ పేసర్ హెన్రీ కి ఏడు  వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్.. 117.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 482 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ హెన్రీ నికోలస్ (106) సెంచరీతో కదంతొక్కగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (96) నాలుగు పరుగులతో శతకం చేజార్చుకున్నాడు.  వీరితో పాటు  వాగ్నర్ (49), గ్రాండ్హోమ్ (45) రాణించడంతో కివీస్ భారీ స్కోరు చేసింది. 

388 పరుగుల ఛేదనతో పాటు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సిన క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్ లో కూడా తడబడ్డారు. సౌథీ, హెన్రీ ధాటికి ఆ జట్టు ఓపెనర్లిద్దరూ డకౌట్ అయ్యారు. అనంతరం వచ్చిన మార్క్రమ్ (2), డసెన్ (9) కూడా విఫలమయ్యారు. టెంబ బవుమా (41) తో ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడినా.. అతడికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. దీంతో ఆ జట్టుకు ఘోర పరాభావం తప్పలేదు. 

 

ఇక కివీస్ బౌలర్లలో సౌథీకి ఐదు వికెట్లు దక్కగా.. హెన్రీ, వాగ్నర్ కు రెండేసి వికెట్లు దక్కాయి. కైల్ జెమీసన్ కు ఒక వికెట్ దక్కింది. కాగా.. 1932 నుంచి ఈ రెండు జట్లు టెస్టులలో తలపడుతున్నాయి. ఇప్పటివరకూ  కివీస్-ప్రొటీస్ జట్ల మధ్య 46 టెస్టులు జరిగాయి. ఇందులో  న్యూజిలాండ్ గెలిచింది ఐదు టెస్టులు (తొలి టెస్టు విజయంతో కలిపి) మాత్రమే.. సౌతాఫ్రికా 25 టెస్టులు నెగ్గగా 16 టెస్టులు డ్రా అయ్యాయి. అంతేగాక 2004 తర్వాత న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాను ఓడించటం ఇదే ప్రథమం. 
 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !