IND vs AFG: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్ట‌నున్న రోహిత్ శ‌ర్మ.. అలాగే, ఎంఎస్ ధోని.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 14, 2024, 11:55 AM IST

India vs Afghanistan: మొహాలీ వేదిక‌గా భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య జ‌రిగి తొలి టీ20లోభార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇండోర్ లో జ‌ర‌గ‌బోయే రెండో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్టార్ ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల రికార్డులను బ‌ద్ద‌లు కొట్ట‌నున్నాడు.
 


Rohit Sharma-Virat Kohli: భార‌త్-అఫ్గానిస్తాన్‌ మూడు టీ20ల సిరిస్ లో  భాగంగా రెండో మ్యాచ్ ఆదివారం (జ‌నవరి 14న) ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 150 షార్ట్ మ్యాచ్ లు పూర్తి చేసుకుని స‌రికొత్త రికార్డు న‌మోదుచేయ‌నున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. అంత‌కుముందు, జనవరి 11న ఆఫ్ఘ‌నిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ డకౌట్ కాగా, శివమ్ దూబే (60*) హాఫ్ సెంచరీతో చెల‌రేగ‌డంతో భార‌త్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్ లో జరిగే రెండో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవ‌సం చేసుకోవాల‌ని టీమిండియా చూస్తోంది.

రోహిత్ శ‌ర్మ రికార్డుల మోత‌.. 

Latest Videos

undefined

2007 సెప్టెంబర్ 17న డర్బన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టీ20లో అరంగేట్రం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. ఇప్పటివరకు 149 మ్యాచ్ లు ఆడి 4 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలతో 3853 పరుగులు చేశాడు. అఫ్గానిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భార‌త్ విజయం సాధించడం ద్వారా పొట్టి ఫార్మాట్ లో 100 మ్యాచ్ ల‌ను గెలిచిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఆదివారం జ‌రిగే  రెండో 20 మ్యాచ్ ఆడితే.. 150 టీ20 మ్యాచ్ ల‌ను ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.

ఆ రనౌట్ లో తప్పెవరిది.. శుభ్‌మ‌న్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ కావ‌డం క‌ర‌క్టేనా...?

టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్ ల‌ను ఆడిన టాప్-5 క్రికెట‌ర్స్ 

రోహిత్ శర్మ - భారత్ - 149 మ్యాచ్ లు - 3853 పరుగులు
పాల్ స్టిర్లింగ్ - ఐర్లాండ్ - 134 మ్యాచ్ లు - 3438 పరుగులు
జార్జ్ డాక్రెల్ - ఐర్లాండ్ - 128 మ్యాచ్ లు - 969 పరుగులు
షోయబ్ మాలిక్ - పాకిస్తాన్ - 124 మ్యాచ్ లు - 2435 పరుగులు
మార్టిన్ గప్తిల్ - న్యూజిలాండ్ - 122 మ్యాచ్ లు - 3531 పరుగులు

టీ20 క్రికెట్‌లో 100 విజయాలు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్ట‌నున్న రోహిత్ శ‌ర్మ‌.. ! 

విరాట్ కోహ్లీ (4008 పరుగులు) తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అయితే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశ‌ముంది. భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ 50 మ్యాచ్ ల్లో 1570 పరుగులు చేశాడు. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్  మ్యాచ్ లో  రోహిత్ శర్మ 44 పరుగులు చేస్తే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. హిట్ మ్యాన్ ఇప్పటివరకు భారత్ కు 52 టీ20 మ్యాచ్ ల‌లో సార‌థ్యం వ‌హించి 1527 పరుగులు చేశాడు.

ఎంఎస్ ధోనీ రికార్డును సైతం సమం చేసే ఛాన్స్ ! 

భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కూడా రోహిత్ శ‌ర్మ భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ లో స‌మం చేసే అవ‌కాశ‌ముంది. 2021లో విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ ఇప్పటివరకు తన కెప్టెన్సీలో ఆడిన 52 మ్యాచ్ ల‌లో 40 విజయాలు సాధించాడు. అఫ్గానిస్థాన్ తో జరిగే తదుపరి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే ధోనీ కెప్టెన్సీ రికార్డును రోహిత్ శ‌ర్మ సమం చేస్తాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భార‌త్ 42 టీ20ల్లో విజ‌యం సాధించింది.

భార‌త నెంబ‌ర్.1 క్రికెట‌ర్ టెండూల్క‌ర్ కాదు, కోహ్లీ కాదు.. మ‌రి ఇంకెవ్వ‌రు?

click me!