NZ v PAK: డారిల్ మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు..

By Mahesh Rajamoni  |  First Published Jan 12, 2024, 3:36 PM IST

New Zealand vs Pakistan: న్యూజిలాండ్-పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన తొలి టీ20లో కీవీస్ జ‌ట్టు పాక్ ను చిత్తు చేసింది. 227 పరుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్ 18 ఓవ‌ర్ల‌లోనే 180 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో డారిల్ మిచెల్, విలియ‌మ్సన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు.
 


New Zealand vs Pakistan: పాకిస్తాన్ ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పాకిస్తాన్ శుక్ర‌వారం తొలి టీ20 మ్యాచ్ ఆడింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ జ‌రిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ డారిల్ మిచెల్ (27 బంతుల్లో 61), కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 57)లు రాణించ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 226/8 ప‌రుగులు చేసింది. 227 భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ టీమ్ 18 ఓవ‌ర్ల‌లోనే 180 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో బాబార్ ఆజం 57 ప‌రుగుల‌తో రాణించాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టిన డారిల్ మిచెల్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

టీ20 క్రికెట్‌లో 100 విజయాలు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

Latest Videos

న్యూజిలాండ్-పాకిస్థాన్ తొలి టీ20 హైలైట్స్

మొదటి ఇన్నింగ్స్:

న్యూజిలాండ్ స్కోరు - 20.0 ఓవర్లలో 226/8
డారిల్ మిచెల్ 61(27)
కేన్ విలియమ్సన్ 57(42)

పాక్ బౌలింగ్: 
అబ్బాస్ అఫ్రిది 4-34-3
షాహిన్ అఫ్రిది 4-46-3

ఆ రనౌట్ లో తప్పెవరిది.. శుభ్‌మ‌న్ గిల్ పై రోహిత్ శర్మ ఫైర్ కావ‌డం క‌ర‌క్టేనా...?

రెండో ఇన్నింగ్స్:

పాకిస్తాన్ స్కోరు - 18.0 ఓవర్లలో 180/10

పాక్ బ్యాటింగ్: 

బాబర్ అజామ్ 57(35)
సైమ్ అయూబ్ 27(8)

న్యూజిలాండ్ బౌలింగ్:

టిమ్ సౌథీ 4-25-4
బెన్ సియర్స్ 4-42-2

SL VS ZIM: వనిందు హసరంగా విశ్వ‌రూపం.. 7 వికెట్లతో జింబాబ్వే ను దెబ్బ‌కొట్టి.. !

click me!