IND vs AFG: 106 వన్డేల తర్వాత టీ20 అరంగేట్రం.. అయినా ఫ‌లితం లేక‌పాయే.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 12, 2024, 2:26 PM IST

Rahmat Shah T20 International Debut: భారత్ తో జరిగిన తొలి టీ20 ద్వారా అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాట్స్ మన్ రహ్మత్ షా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ అరంగేట్రం చేశాడు. 106 వన్డేలు, 7 టెస్టులు ఆడిన రహ్మత్ షాకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించ‌డం గమనార్హం. 
 


Rahmat Shah T20 International Debut: భారత్ తో జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాట‌ర్ రహ్మత్ షాకు అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 106 వన్డేలు, 7 టెస్టులు ఆడిన రహ్మత్ షాకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించిడం గ‌మ‌నార్హం. అయితే, అత‌ని అరంగేట్రం మ్యాచ్ లో భార‌త్ చేతిలో ఆఫ్ఘ‌నిస్తాన్ చిత్తు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో చాలా కాలం త‌ర్వాత టీ20ల్లోకి వ‌చ్చిన పెద్ద‌గా టీమ్ కు ఫ‌లితం లేక‌పాయే అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. 

30 ఏళ్ల రహ్మ‌త్ షా భార‌త్ ఆఫ్ఘ‌నిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రహమత్ పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు రహ్మత్ 106 వన్డేల్లో 5 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో మొత్తం 3589 పరుగులు చేశాడు. టెస్టుల్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 1 సెంచరీ, 3 అర్ధసెంచరీలతో 424 పరుగులు చేశాడు.

Latest Videos

భార‌త నెంబ‌ర్.1 క్రికెట‌ర్ టెండూల్క‌ర్ కాదు, కోహ్లీ కాదు.. మ‌రి ఇంకెవ్వ‌రు?

మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఆఫ్ఘ‌న్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. 20 ఓవ‌ర్ల‌లో ఆఫ్ఘ‌న్ టీమ్ 158/5 ప‌రుగులు చేసింది. ఇక 159 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. మ్యాచ్ తొలి ఓవ‌ర్ రెండో బాల్ కు రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ గా వెనుదిరిగాడు. అయితే, యంగ్ ప్లేయ‌ర్స్ శివ‌మ్ దుబే, తిల‌క్ వ‌ర్మ‌, జితేశ్ శ‌ర్మ‌లు బ్యాటింగ్ లో రాణించ‌డంతో భార‌త్ 17.3 ఓవ‌ర్ల‌లో టార్గెన్ ను ఛేదించింది. మూడు టీ20ల సిరీస్ లో భార‌త్ 1-0 ఆధిక్యం సాధించింది. భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ రెండో టీ20 ఆదివారం  నాడు ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

టీ20 క్రికెట్‌లో 100 విజయాలు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

click me!