కోహ్లీ కాదు.. ధోనీ కాదు.. కేఎల్ రాహుల్ కు స్ఫూర్తినిచ్చింది ఎవ‌రు?

By Mahesh Rajamoni  |  First Published Mar 1, 2024, 5:19 PM IST

KL Rahul: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ గాయం సంబంధిత కార‌ణాల‌తో భార‌త్-ఇంగ్లాండ్ 5వ టెస్టుకు దూర‌మ‌య్యాడు. అయితే, నిత్యం ఇలా గాయాల బారిన‌ప‌డుతున్న‌ప్ప‌టికీ త‌న‌లో ఓ ప్లేయ‌ర్ స్ఫూర్తిని ర‌గిలిస్తూనే ఉంటార‌ని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. 
 


Star Indian middle-order batter KL Rahul: గాయం కారణంగా మార్చి 7 నుంచి ధర్మశాలలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ కు భారత స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ దూర‌మ‌య్యాడు. నిత్యం అత‌ను గాయాల బారిన‌ప‌డ‌టం పై ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. అయితే, తాను గాయాల‌తో ఆట‌కు దూర‌మైన మ‌ళ్లీ క్రీజులో అడుగుపెట్ట‌డానికి ఒక స్టార్ ప్లేయ‌ర్ త‌న‌కు స్ఫూర్తిని క‌లిగిస్తూనే ఉంటార‌ని పేర్కొన్నాడు. ఇటీవ‌లి కాలంలో తాను క‌లిసి ఆడిన ప్లేయ‌ర్ అత‌న‌ని చెప్పాడు. దీంతో టీమిండియా సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లీ, భార‌త లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీల‌ను అనుకున్నారు. కానీ, ఆ ఇద్ద‌రు కాదు.. !

దీంతో కేఎల్ రాహుల్ చేసిన తాజా కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 31 ఏళ్ల భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ను..  మీకు స్ఫూర్తి నింపే వ్య‌క్తం గురించి చెప్ప‌మ‌ని ఆడ‌గ్గా, దానికి సమాధానంగా సౌతాఫ్రికా దిగ్గ‌జ ప్లేయ‌ర్, ఐపీఎల్ లో ఆర్బీసీ త‌ర‌ఫున ఆడిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అని చెప్పాడు. ఐపీఎల్లో ఆర్సీబీతో కలిసి ఆడిన రోజుల్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్తో డ్రెస్సింగ్ రూమ్ కేఎల్ రాహుల్ పంచుకున్నాడు. బెంగళూరులో జన్మించిన ఈ క్రికెటర్ ఐపీఎల్ 2013, 2016 సీజ‌న్ల‌లో ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Latest Videos

undefined

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !

నిజ జీవితంలో త‌న తండ్రి నుంచి ప్రేర‌ణ పొందాన‌నీ, క్రికెట్ మైదానంలో ఏబీ డివిలియర్స్ నుంచి స్ఫూర్తి పొందాన‌ని కేఎల్ రాహుల్ స్టార్ స్పోర్ట్స్ తో అన్నాడు. ఐపీఎల్ 2011 మెగా వేలం నుంచి ఆర్సీబీ తరఫున 11 సీజన్లు ఆడిన ఏబీ డివిలియర్స్ 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గత నెల రోజులకు పైగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ తదుపరి ఐపీఎల్ 2024లో బరిలోకి దిగనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ రాబోయే సీజన్ లో ఆ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆర్సీబీ, స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వంటి జట్ల తరఫున మొత్తం 118 మ్యాచ్ ల‌ను ఆడిన కేఎల్ రాహుల్ 46.77 సగటుతో 4163 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివ‌ర‌కు 4 సెంచ‌రీలు, 33 అర్ధసెంచరీలు సాధించాడు.

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 భార‌త బౌల‌ర్లు వీరే !

click me!