టెండూల్కర్ కాదు.. శ్రీలంక క్రికెట్ దిగ్గ‌జం ముత్తయ్య మురళీధరన్ ను భ‌య‌పెట్టిన భార‌త ప్లేయ‌ర్ ఎవ‌రంటే..?

By Mahesh RajamoniFirst Published Jan 7, 2024, 5:06 PM IST
Highlights

Team India: శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్త‌య్య  ముర‌ళీధ‌ర‌న్ ను భ‌య‌పెట్టింది స‌చిన్ టెండూల్క‌ర్ కాదట‌.. ! మురళీధరన్ తన కెరీర్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా భావించిన భ‌ర‌త క్రికెట‌ర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డిస్తూ సెహ్వాగ్‌కి గురించి ప్ర‌స్తావించాడు.
 

Muttiah Muralitharan-Virender Sehwag: క్రికెట్ దిగ్గ‌జ బౌలర్, శ్రీలంక మాజీ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ఇటీవల తన కెరీర్ లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా భావించిన ఆటగాడి గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. తాను బౌలింగ్ చేయ‌డానికి క‌ష్ట‌ప‌డ్డ ప్లేయ‌ర్లలో  'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇదే స‌మ‌యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరును ప్రస్తావిస్తూ ప్ర‌శంస‌లు కురిపించాడు.

టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ముత్త‌య్య ముర‌ళీ ధ‌ర‌న్.. త‌న కెరీర్ లో బౌలింగ్ చేయ‌డానికి ఇబ్బంది ప‌డ్డ ఘ‌ట‌న‌లు, ప్లేయ‌ర్ల గురించి ప్ర‌స్తావించారు. ఆశ్చర్యకరంగా వీరేంద్ర సెహ్వాగ్ కు బౌలింగ్ చేయ‌డానికి ఇబ్బంది పడ్డానని చెప్పారు. 1,300కు పైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన మురళీధరన్ ఈ సమయంలో ఆఫ్ బ్రేక్ లా కనిపించే లాభదాయకమైన 'సెకండ్, లెగ్ బ్రేక్' నేర్చుకోవడం తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని వెల్లడించాడు.

Latest Videos

MS Dhoni: హుక్కా పీలుస్తూ.. ధోనీ వీడియో వైర‌ల్.. కెప్టెన్ కూల్ పై విమ‌ర్శ‌లు

ఎస్బీ కాలేజీ విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ లో మురళీధరన్ మాట్లాడుతూ 'సెకండ్' బౌలింగ్ ప్రాథమికాంశాలను నాకు నేర్పింది సక్లైన్ ముస్తాక్ (పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్) అని చెప్పాడు. 'సెకండ్' ఛాలెంజింగ్ బంతి అని, దాన్ని కచ్చితంగా బౌలింగ్ చేయడానికి నాకు మూడేళ్లకు పైగా పట్టిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2011 సందర్భంగా కొచ్చి టస్కర్స్ తో తనకున్న అనుబంధాన్ని శ్రీలంక లెజెండ్ గుర్తు చేసుకున్నాడు. 'కొచ్చి టస్కర్స్ తరఫున ఆడటం గొప్ప అనుభవం. శ్రీశాంత్, సంజూ శాంసన్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లను కేరళ తయారు చేస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పాడు.

కాగా, ముత్తయ్య మురళీధరన్ టెస్టు, వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1992 నుండి 2011 వరకు అతని అద్భుతమైన కెరీర్‌లో 350 వ‌న్డేలు ఆడి 534 వికెట్లు తీశాడు. ముర‌ళీధ‌ర‌న్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 7/30. ప‌దిసార్లు ఐదు వికెట్లు కూడా సాధించాడు. 1992 నుండి 2008 వరకు సుదీర్ఘమైన టెస్ట్ కెరీర్‌లో, ముత్తయ్య మురళీధరన్ 133 మ్యాచ్‌లలో 800 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 9/51 కాగా, ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 22 సార్లు సాధించాడు. అలాగే, ఐదు వికెట్ల‌ను 67 సార్లు సాధించాడు. మురళీధరన్ 2008లో భారత్‌తో తన చివరి మ్యాచ్ ఆడుతూ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌తో శ్రీలంక ఓడిపోవడంతో అత‌ను వ‌న్డే కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.

వింటేజ్ రైడ్ లో ర‌వీంద్ర జ‌డేజా.. ఎద్దుల బండి నడుపుతున్న వీడియో వైరల్.. !

click me!