నాలుగో టెస్టులో విజయం.. ఆ నమ్మకమే తమను గెలిపించిందన్న కోహ్లీ..!

Published : Sep 07, 2021, 08:03 AM ISTUpdated : Sep 07, 2021, 08:07 AM IST
నాలుగో టెస్టులో విజయం.. ఆ నమ్మకమే తమను గెలిపించిందన్న కోహ్లీ..!

సారాంశం

తొలి ఇన్నింగ్స్ లో 99 పరుగుల కీలక ఆధిత్యం సంపాదించినా చివరికి ఆ జట్టు ఓటమి పరాభవం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు.  

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. కాగా.. ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశారు. చివరి టెస్టులో పది వికెట్లు తీస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగామని కోహ్లీ పేర్కొన్నాడు. సోమవారం మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ సేన విజయానికి పది వికెట్లు అవసరం కాగా ఇంగ్లాండ్ గెలుపునకు 291 పరుగులు అవసరమయ్యాయి.

ఈ నేపథ్యంలోని చివరికి ఆతిథ్య జట్టు 210 పరుగులకు ఆలౌట్ మ్యాచ్ లో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 99 పరుగుల కీలక ఆధిత్యం సంపాదించినా చివరికి ఆ జట్టు ఓటమి పరాభవం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు.

మేం గెలిచిన రెండు మ్యాచుల్లో ఆటగాళ్లు పట్టుదల చూపించారని కోహ్లీ పేర్కొన్నారు. గెలవాలనే కసితో ఆడామన్నారు. ఈ మ్యాచ్ లో తాము డ్రా కోసం ప్రయత్నించలేదన్నారు. గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగామన్నారు. ఆటగాళ్ల కృషి, పట్టుదలకు గర్వపడుతున్నానన్నారు, అలాగే ఈ జట్టులోని ముగ్గురు టాప్ బౌలర్ల ప్రదర్శన చూసిన కెప్టెన్ గాను ఎంతో సంబరపడుతున్నామన్నారు.

ఇక ఈ మ్యాచ్ లో వాతావరణం వేడిగా ఉండటంతో మేం గెలిచే అవకాశం ఉందని ముందే అనుకున్నామన్నారు. ఈ క్రమంలోనే బౌలర్లు అదరగొట్టారన్నారు. బుమ్రా, జడేజా మాయ చేశారన్నారు. ముఖ్యంగా బంతి రివర్స్ స్వింగ్ కు అనుకూలంగా ఉందని తెలియగానే.. బుమ్రా బంతి ఇవ్వాలని కోరాడని..దాంతో అతనికి బంతి ఇవ్వగానే రెండు వికెట్లు తీశాడని గుర్తు చేశాడు.

ఇక రోహిత్, శార్దూల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నారన్నారు. ముఖ్యంగా శార్దూల్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ మెరిశాడన్నారు. అతడి ప్రదర్శన అత్యద్భుతమని ప్రశంసించారు,  అతని రెండు హాఫ్స సెంచరీలు ఇంగ్లాండ్ ని దెబ్బతీశాయన్నారు. 

PREV
click me!

Recommended Stories

T20I Fastest Fifties: భారత్ తరఫున మెరుపు హాఫ్ సెంచరీలు బాదిన టాప్ 5 ప్లేయర్లు వీరే
Abhishek Sharma : ఇదేం బాదుడురా సామీ.. యువీ రికార్డు మిస్.. అభిషేక్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్