ఐపీఎల్‌ నిర్వహిస్తాం.. ఛాన్స్ ఇవ్వమన్న శ్రీలంక: స్పందించిన బీసీసీఐ

By Siva KodatiFirst Published Apr 17, 2020, 7:53 PM IST
Highlights

 ఐపీఎల్‌కు అతిథ్యమివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బీసీసీఐ ఉన్నతాధికారి... ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్న క్లిష్ట పరిస్ధితుల్లో దానిపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేమని తెలిపారు

కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను భారత్‌లో కాకుండా మరో చోట నిర్వహించవచ్చు కదా అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఐపీఎల్‌కు అతిథ్యమివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బీసీసీఐ ఉన్నతాధికారి... ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్న క్లిష్ట పరిస్ధితుల్లో దానిపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేమని తెలిపారు.

Also Read:ఐపీఎల్ వల్లే... అంటూ కోహ్లీ సేన పై క్లార్క్ అనుచిత వ్యాఖ్యలు: దిగ్గజాల ఫైర్

అయితే శ్రీలంక క్రికెట్ బోర్డ్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని, కానీ ప్రస్తుతం వాటి గురించి చర్చించడం సరికాదని అన్నారు. కాగా ఐపీఎల్ నిర్వహణకు అవసరమైన వనరులు, వేదికలు తమ వద్ద వున్నాయని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్లా గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే శ్రీలంకలో ప్రస్తుతం కర్ఫ్యూ ఉందని.. తమ దేశంలో త్వరలోనే ఈ మహమ్మారి నియంత్రణలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌తో పోలిస్తే లంకలో కోవిడ్ 19 తీవ్రత పెద్దగా లేదు.

అక్కడ దాదాపు 200 మందికి మాత్రమే వైరస్ సోకింది. ఐపీఎల్‌ను నిర్వహిస్తే తమ బోర్డు ఆర్ధికంగా బలపడుతుందని శ్రీలంక ఆశిస్తోంది.. అయితే బీసీసీఐ సెప్టెంబర్-అక్టోబర్, అక్టోబర్-నవంబర్ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలను కొట్టిపారేయలేమని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.

Aslo Read:ధోని నిరూపించుకోవాల్సింది ఏమి లేదు, ప్రపంచ కప్ ఆడించాల్సిందే: భజ్జి

కాగా ఈ అంశంపై మరో బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఐసీసీలో బీసీసీఐ మిత్రపక్షంగా శ్రీలంక ఉంది. వారి ప్రతిపాదనను అర్ధం చేసుకోగలం.. కానీ ఐసీసీ ఛైర్మన్ మనోహర్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయవచ్చునని ఆయన అన్నాడు.

అంతేకాకుండా ఐపీఎల్‌ను భారత్ వెలుపల నిర్వహించాలని భావిస్తే శ్రీలంకతో పాటు మరిన్ని దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పాడు. వివిధ కారణాల వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఇప్పటి వరకు భారత్‌ వెలుపల రెండు సార్లు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో, దక్షిణాఫ్రికాలో 2014 తొలి అర్థభాగాన్ని యూఏఈలో నిర్వహించారు. 

click me!