
ప్రపంచ క్రికెట్లో ఈ కరోనా లాక్ డౌన్ వేళా కూడా బాగా చర్చకువస్తున్న అంశాల్లో ఒకటి ఐపీఎల్ వాయిదా అయితే రెండవది మహేంద్ర సింగ్ ధోని కెరీర్ పై చర్చ్. ఇది ట్ 20 ప్రపంచ కప్ జరుగుతుందా వాయిదా పడుతుందా అనే చర్చను కూడా దాటిపోయింది.
క్రికెట్ ప్రపంచం తన గురించి మాట్లాడుతుంటే, అతడు మాత్రం మౌనముద్రలోనే ఉండిపోతాడు. ఎం.ఎస్ ధోని క్రికెట్ కెరీర్ అసాంతం ఇదే తతంగం. ఇప్పుడు మహి కెరీర్ ముగింపులోనూ అదే కథ పునరావృతం అవుతోంది.
2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ అనంతరం ఎం.ఎస్ ధోని మైదానంలో కనిపించలేదు. ఐపీఎల్ 13తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగేందుకు ధోని సన్నద్ధమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ 2020 వాయిదాతో టీ20 వరల్డ్‌కప్‌కు ధోనిని ఏ లెక్క ప్రకారం జాతీయ జట్టులోకి తీసుకుంటారని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సహా కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ధోనితో కలిసి జాతీయ జట్టు డ్రెస్సింగ్‌రూమ్ పంచుకున్న సహచరుడు, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ స్పందించాడు. ధోని వంటి దిగ్గజ ఆటగాడు అందుబాటులో ఉంటే, వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాల్సిందేనని అన్నాడు.
భారత క్రికెట్‌కు ఎం.ఎస్ ధోని ఎంతో చేశాడని, ధోని అతి పెద్ద క్రికెటర్ అని, అతడి స్థాయి వేరు అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ధోని వంటి దిగ్గజ ఆటగాడు కొత్తగా నిరూపించుకోవడానికి ఏం ఉండదని, టీ20 వరల్డ్‌కప్‌కు మహి అందుబాటులో ఉంటే, కచ్చితంగా ఎంపిక చేయాల్సిందేనాని ఘంటాపథంగా చెప్పాడు.
ఐపీఎల్ ప్రదర్శనతో ధోని ఎంపికను ఏమాత్రం ముడిపెట్టకూడదని, ఐపీఎల్‌లో సత్తా చాటి జాతీయ జట్టులోకి రావటం, కెరీర్‌లో నిరూపించుకోని క్రికెటర్లకు వర్తిస్తుంది తప్ప ఇప్పటికే తానేమిటో చాటిచెప్పిన ఎం.ఎస్ ధోని వంటి దిగ్గజాలకు అది వర్తించదని భజ్జి వ్యాఖ్యానించాడు.
జాతీయ జట్టులోకి నేరుగా వచ్చేందుకు ధోని పూర్తిగా అన్ని విధాలుగా అర్హుడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఇకపోతే గౌతమ్ గంభీర్ మొన్న ధోనిని ప్రపంచ కప్ లో ఎలా ఆడిస్తారని, కెఎల్ రాహుల్ రూపంలో ధోనికి మంచి ప్రత్యామ్నాయం దొరికిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.