16 సిక్సర్లు, 5 ఫోర్లు.. రికార్డు సెంచ‌రీతో పాక్ బౌల‌ర్ల‌ను ఉతికిపారేసిన ఫిన్ అలెన్..

By Mahesh Rajamoni  |  First Published Jan 17, 2024, 9:59 AM IST

New Zealand vs Pakistan: డునెడిన్‌లోని యూనివర్శిటీ ఓవల్‌ వేదికగా జ‌రిగిన మూడో టీ20లోనూ న్యూజిలాండ్ పాకిస్తాన్ ను చిత్తు చేసింది. కీవీస్ ఓపెనింగ్ బ్యాట‌ర్  ఫిన్ అలెన్ వ‌రుస సిక్స‌ర్ల‌తో పాక్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ఏకంగా 16 సిక్సర్లు, 5 ఫోర్లు తో రికార్డు సెంచ‌రీతో న్యూజిలాండ్ కు విజ‌యం అందించాడు.
 


Finn Allen Century vs Pakistan: ఓవల్‌ వేదికగా జ‌రిగిన మూడో టీ20లోనూ న్యూజిలాండ్ పాకిస్తాన్ ను చిత్తు చేసింది. కీవీస్ ఓపెనింగ్ బ్యాట‌ర్  ఫిన్ అలెన్ వ‌రుస సిక్స‌ర్ల‌తో పాక్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ఏకంగా 16 సిక్సర్లు, 5 ఫోర్లు తో రికార్డు సెంచ‌రీతో న్యూజిలాండ్ కు విజ‌యం అందించాడు. పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 45 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఫిన్ అలెన్, సీఫెర్ట్ రాణించ‌డంతో న్యూజిలాండ్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 224 ప‌రుగులు చేసింది.

ఫిన్ అలెన్ ఊచ‌కోత‌.. 

Latest Videos

న్యూజిలాండ్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. పాక్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఈ యువ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ ఓవ‌ల్ లో పరుగుల వర్షం కురిపించాడు. కేవ‌లం 62 బంతుల్లో 137 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వ‌రుస సిక్స‌ర్లు కొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించాడు. త‌న ఇన్నింగ్స్ లో ఏకంగా 16 సిక్సర్లు, 5 బౌండరీలు బాదాడు. ఫిన్ అలెన్ 48 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 3వ టీ20లో 137 పరుగులు చేసిన ఫిన్ అలెన్ ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు.

రోహిత్ శ‌ర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్సీ మార్చ‌డానికి ఇదే కార‌ణం..

 

Finn Allen vs Pakistan 😭🔥

34(15) in the first T20I.
74(41) in the second T20I.
137(62) in the third T20I.

Play him ahead of Faf !! True potential shouldn't be warming the benchpic.twitter.com/WzJFum5Zyk

— Dr. விடாமுயற்சி Salvatore (@KohliThala)

ఫిన్ అలెన్ రికార్డుల మోత‌.. 

న్యూజిలాండ్-పాకిస్తాన్ మూడో టీ20లో 62 బంతుల్లో 137 పరుగులు చేయడం ఇప్పుడు టీ20ల్లో న్యూజిలాండ్ ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరును ఫిన్ అలెన్ సాధించాడు. అంత‌కుముందు, బ్రెండన్ మెకల్లమ్ 123 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20లో న్యూజిలాండ్ క్రికెటర్ 10కి పైగా సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి. అలాగే, టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. నాలుగు సంవత్సరాల క్రితం డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌పై అదే విధంగా సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్‌తో అలెన్ కొట్టిన 16 సిక్సర్లు అతనిని సమానంగా ఉంచాయి.

ప్రపంచంలోనే తొలి క్రికెట‌ర్ గా విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

45 ప‌రుగులు తేడాతో పాక్ చిత్తు

మూడో టీ20లో పాకిస్తాన్ ను 45 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. షాహీన్ అఫ్రిది నుండి మొహమ్మద్ వసీం జూనియర్ వరకు పాక్ ప్లేయ‌ర్ల బౌలింగ్ ను ఫిన్ అలెన్ ఉతికిపారేశాడు. ఈ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ పాకిస్థాన్ త‌ర‌ఫున అత్య‌త చెత్త బౌల‌ర్ గా నిలిచాడు. అత‌ను 4 ఓవ‌ర్లు బౌల్ చేసి ఏకంగా 60 పరుగులు ఇచ్చాడు. అయితే, 2 వికెట్లు తీసుకోవ‌డం అత‌నికి ఊర‌ట క‌లిగించే అంశం. అఫ్రిది 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకోగా, మహ్మద్ నవాజ్ 44 పరుగులిచ్చి 4 ఓవర్లలో 1 వికెట్ తీశాడు. అలాగే, జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్ వరుసగా 37, 35 పరుగులిచ్చి ఒక్కొక్క వికెట్ తీశారు. 245 ప‌రుగులు భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులు చేసింది. బాబార్ ఆజం 58 ప‌రుగుల‌తో రాణించాడు కానీ, జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు.

జ‌ట్టులో చోటు దక్కకపోవ‌డంపై మౌనం వీడిన శిఖర్ ధావన్.. గ‌బ్బ‌ర్ కామెంట్స్ వైర‌ల్ !

click me!