MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు అయ్యింది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కేసు పెట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ధోనీ.. పరువుకు భంగం కలిగించాడని వీరు కోర్టును ఆశ్రయించారు
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ధోనీపై అతని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్, దివాకర్ భార్య సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ధోనీ..తమపై అసత్య ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం కలిగించాడని మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ దంపతులు కోర్టును ఆశ్రయించారు.
అలాగే.. ధోనీతో పాటు తమకు వ్యతిరేకంగా పోస్ట్‌లను అనుమతించిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఎక్స్, గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్‌లతో పాటు అసత్య కథనాలను పబ్లీష్ చేసిన న్యూస్ వెబ్ సైట్స్ పై కూడా పరువు నష్టం దావా వేసారు.
undefined
2017 లో మిహిర్ దివాకర్, సౌమ్యా, ధోనీలు బిజినెస్ పార్టనర్స్ గా ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెట్ పేరిట దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించారు. వీరి ఒప్పందం ప్రకారం.. అర్కా స్పోర్ట్స్.. ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో సదరు కంపెనీ విఫలమైంది. ఈ విషయంపై తన పార్ట్ నర్స్ తో చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో ధోనీ ఈ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత పలుమార్లు లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు.
ధోనీ తన ఇద్దరు వ్యాపార భాగస్వాములను మోసం చేశారని ఆరోపించారు. క్రికెట్ అకాడమీని ప్రారంభించే కాంట్రాక్టు తనకు రావాల్సి ఉందని, అయితే అది తనకు ఇవ్వలేదని, దాదాపు రూ.16 కోట్ల మేర స్వాహా చేశారని ధోనీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లపై రాంచీ దిగువ కోర్టులో కేసు దాఖలైంది. ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌లపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) మరియు 420 (మోసం) కింద రాంచీ కోర్టులో క్రికెటర్ తరపున క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు ధోనీ ప్రతినిధులు తెలిపారు.
ధోనీపై పరువు నష్టం కేసు
2017 కాంట్రాక్ట్ ఉల్లంఘనకు సంబంధించి ధోనీ , అతని తరపున వ్యవహరిస్తున్న వ్యక్తులు తమపై పరువు నష్టం కలిగించేలా ఆరోపణలు చేస్తున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని దివాకర్ దంపతులు కోరుతున్నారు. ధోని చేస్తుందంతా సత్య ప్రచారమని దివాకర్, సౌమ్యలు పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో తమ పరువుకు భంగం కలిగిందని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.