రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్... వెలుతురు లేమితో ముగిసిన రెండో రోజు ఆట...

By Chinthakindhi RamuFirst Published Jun 20, 2021, 11:08 PM IST
Highlights

ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసిన న్యూజిలాండ్...

టీమిండియా స్కోరుకి 116 పరుగుల దూరంలో న్యూజిలాండ్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వాతావరణం అడ్డంకిగా మారుతూనే ఉంది. పిచ్ చిత్తడిగా ఉండడంతో ఉదయం అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఆట, వెలుతురు సరిగా లేకపోవడంతో అరగంట ముందుగానే ముగిసింది...

రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 49 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. టీమిండియా స్కోరుకి ఇంకా 116 పరుగుల దూరంలో ఉంది న్యూజిలాండ్.

న్యూజిలాండ్ ఓపెనర్లు తొలి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం జతచేశారు. 104 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను అశ్విన్ అవుట్ చేయగా, 153 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

కేన్ విలియంసన్ 37 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాన్వే అవుటైన తర్వాత రెండు బంతులకే బ్యాడ్ లైట్ కారణంగా ఆటను నిలిపివేశారు అంపైర్లు.  

click me!