ఒలింపిక్ అసోసియేషన్‌కి రూ.10 కోట్ల సాయం ప్రకటించిన బీసీసీఐ... దేశీయ క్రికెటర్లకూ...

By Chinthakindhi RamuFirst Published Jun 20, 2021, 9:23 PM IST
Highlights

సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం రూ.10 కోట్ల విరాళం...

దేశవాళీ క్రికెట్ సీజన్ కూడా సజావుగా సాగకపోవడంతో లోకల్ క్రికెటర్లు పరిహారం చెల్లించే దిశగా అడుగులు...

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) దేశంలో క్రీడాభివృద్ధికి తనవంతు సాయం ప్రకటించింది. సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం రూ.10 కోట్లు విరాళం ప్రకటించింది బీసీసీఐ.

టోక్యో వేదికగా జూలై 23 నుంచి ఆగస్టు 8 దాకా ఒలింపిక్స్ సాగనున్న విషయం తెలిసిందే... ఒలింపిక్ వేదికపై భారత అథ్లెట్లు సక్సెస్ సాధించాలని ఆకాంక్షించిన బీసీసీఐ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కి ఆర్థిక మద్ధతుగా ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించింది.

అలాగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంజీ క్రికెటర్లు, దేశవాళీ క్రికెటర్లకు ఆర్థిక ప్రోత్సాహాకాలు అందించేందకు ముందుకొచ్చింది. దీని కోసం అవసరమైన కార్యచరణను త్వరలోనే కమిటీ తయారుచేయనుంది.

ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం దక్కక, కరోనా కారణంగా దేశవాళీ క్రికెట్ సీజన్ కూడా సజావుగా సాగకపోవడంతో ఎందరో లోకల్ క్రికెటర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరికి వార్షిక వేతనం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది బీసీసీఐ.

click me!