ICC WTC Final: రెండో రోజు రెండు సెషన్లూ న్యూజిలాండ్‌వే... వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు...

By Chinthakindhi RamuFirst Published Jun 20, 2021, 8:42 PM IST
Highlights

తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా...

టీ బ్రేక్ సమయానికి 21 ఓవర్లలో 36 పరుగులు చేసిన న్యూజిలాండ్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండో రోజు రెండు సెషన్లలోనూ న్యూజిలాండ్ ఆధిక్యమే దక్కింది. ఓవర్ నైట్ స్కోరు 146/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, మరో 71 పరుగులు జోడించి 217 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. 

వైస్ కెప్టెన్ అజింకా రహానే 49 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 44 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ పేసర్ కేల్ జెమ్మీసన్ ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండో సెషన్‌లో 6 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా.

న్యూజిలాండ్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. టీ బ్రేక్ సమయానికి 21 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 36 పరుగులు చేసింది న్యూజిలాండ్...
 

click me!