బుమ్రాపై రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం: అసలేం జరిగింది?

By telugu teamFirst Published Dec 21, 2019, 11:09 AM IST
Highlights

టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు ఎన్ సిఐ టెస్టు నిర్వహించడానికి తిరస్కరించడం వెనక అసలు కారణం ఉంది. నియమాలను ఉల్లంఘించినందుకే బుమ్రాపై రాహుల్ ద్రావిడ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబై: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాపై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ సిఐ) అధ్యక్షుడు రాహుల్ ద్రావిడ్ ఎందుకు గుర్రుగా ఉన్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. బుమ్రాకు ఫిట్నెస్ టెస్టు నిర్వహించడానికి ఎన్ సిఎ ఎందుకు నిరాకరించిందనేది ప్రశ్న. బుమ్రా వెన్ను నొప్పితో గాయపడి చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే, ఆ విషయంలో బుమ్రా ఎన్ సిఏ నియమనిబంధనలను పాటించలేదనేది ప్రధానమైన అభ్యంతరంగా కనిపిస్తోంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కాంట్రాక్ట్ ప్లేయర్ ఎవరైనా గాయపడితే ఎన్ సిఎ ఆధ్వర్యంలోని వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స జరగాలి. బుమ్రా అలా చేయకుండా ఇంగ్లాండులోని తన సొంత స్పెషలిస్టులను సంప్రదించాడు. తన వైద్య చికిత్స కోసం ఎన్ సిఏ ను సంప్రదించడం లేదని బుమ్రా టీమ్ మేనేజ్ మెంట్ కు కూడా తెలియజేశాడు.

Also Read: బుమ్రాకు రాహుల్ ద్రావిడ్ షాక్: సౌరవ్ గంగూలీ జోక్యం

అయితే, ఎన్ సిఐ డైరెక్టర్ నేతృత్వంలోని ఫిజియో బృందం, వైద్య సిబ్బంది క్రికెటర్ ను పరీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటుంది. గాయాలకు కారణాలను కూడా విశ్లేషిస్తుంది. అయితే, బుమ్రా గాయం నుంచి కోలుకోవడానికి తన సొంత వైద్య బృందాన్ని వాడుకున్నాడు. తాను బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అనే విషయాన్ని బుమ్రా మరిచిపోయాడు. 

అంతేకాకుండా, తన ఐపిఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చెప్పినట్లు బుమ్రా నడుచుకున్నాడు. వారు చెప్పినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ట్రెయినర్ రజనీకాంత్ శివజ్ఞానం ఆధ్వర్యంలో ముంబైలో చికిత్స తీసుకున్నాడు. 

ఎన్ సిఎను సంప్రదించి, బిసిసిఐ వైద్య బృందం సూచనల ప్రకారం చికిత్స చేయించుకోవాల్సిన బుమ్రా అందుకు విరుద్ధంగా వ్యవహించారనే కారణంతో ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించడానికి ఎన్ సిఐ నిరాకరించింది. తిరిగి జట్టులోకి అడుగు పెట్టాలంటే ఎన్ సిఏ టెస్టును బుమ్రా పాస్ కావాల్సిందే.

click me!