IPL Auction 2020: చెన్నై రసగుల్లా వ్యాఖ్య, కేకేఆర్ తమిళ ప్రశ్న

Published : Dec 20, 2019, 08:06 PM ISTUpdated : Dec 20, 2019, 09:26 PM IST
IPL Auction 2020: చెన్నై రసగుల్లా వ్యాఖ్య, కేకేఆర్ తమిళ ప్రశ్న

సారాంశం

కోల్ కతా నైట్ రైడర్స్ కు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్విట్టర్ లో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది. చెన్నై రసగుల్లాను తింటున్న టీమ్ మెంబర్ ఫొటో పెట్టి ట్విట్ చేస్తే దానిపై కేకేఆర్ ప్రశ్న వేసింది.

చెన్నై: కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ హ్యాండిల్స్ మధ్య ఆహారపు రుచుల పరస్పర వ్యాఖ్యల వ్యవహారం నడుస్తోంది. కోల్ కత్తాలో గురువారం ఆటగాళ్ల వేలం పాటలు సందర్భంగా ఆ వ్యవహారం ప్రారంభమైంది. 

తొమ్మిది మంది కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్న కేకేఆర్ చాలా చురుగ్గా ఉంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ను అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్రస్ నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది. 

 

పియూష్ చావ్లా, సామ్ కర్రాన్ లను భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. తమ జట్టు సభ్యుడు రసగుల్లాను తింటున్న పిక్చర్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ సభ్యుడెవరనేది తెలియకుండా ఆ పోస్టు పెట్టింది. 

దానిపై కేకేఆర్ తమిళంలో ప్రశ్నను విసిరింది. అది బాగుందా అంటూ ఆ ప్రశ్న వేసింది. దానికి చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమిళంలో జవాబిచ్చింది. ఈ పరస్పర సంభాషణలను కేకేఆర్, సిఎస్కే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?