దేశం గర్వపడేలా కృషి చేస్తా.. రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నమహ్మద్ షమీ

By Mahesh Rajamoni  |  First Published Jan 9, 2024, 3:03 PM IST

National Sports Awards 2023: భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. అర్జున అవార్డు అందుకోవడానికి ముందు షమీ మాట్లాడుతూ.. 'ఇది ఒక కల అని.. జీవితం కొనసాగుతుంది.. ప్రతి ఒక్కరికీ ఈ అవార్డు దక్కదని.. నా పేరు ఈ అవార్డుకు నామినేట్‌ కావడం సంతోషంగా ఉందని' తెలిపాడు.
 


Shami receives Arjuna Award from President: దేశం గర్వపడేలా క్రికెట్ లో రాణిస్తున్న భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డు లభించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అర్జున అవార్డును షమీ అందుకున్నాడు. 2023 ఐసీసీ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ పేరును అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది.

2023 వన్డే వరల్డ్ కప్ లో మహ్మద్ షమీ కేవలం 7 మ్యాచ్ లను మాత్రమే ఆడి 24 వికెట్లు పడగొట్టి జట్టును ఫైనల్ తీసుకురావ‌డంతో కీల‌క పాత్ర పోషించాడు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై రన్నరప్ గా  నిలిచింది. అర్జున అవార్డు అందుకోవడానికి ముందు షమీ మాట్లాడుతూ.. 'ఇది ఒక కల అని.. జీవితం కొనసాగుతుంది.. ప్రతి ఒక్కరికీ ఈ అవార్డు దక్కదని.. నా పేరు ఈ అవార్డుకు నామినేట్‌ కావడం సంతోషంగా ఉందని తెలిపాడు.

Latest Videos

undefined

అర్జున అవార్డు అందుకున్న త‌ర్వాత ష‌మీ స్పందిస్తూ.. 'ఈ రోజు నాకు రాష్ట్రపతి నుంచి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం సగర్వంగా.. సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావడానికి ఎంతో సహాయం చేసిన.. నా ఒడిదుడుకులలో ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను... నా కోచ్, బీసీసీఐ, జట్టు సభ్యులకు, నా కుటుంబానికి, సిబ్బందికి, నా అభిమానులకు పెద్ద కృతజ్ఞతలు.. నా కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు.. నా దేశం గర్వపడేలా నా వంతు కృషి చేస్తాను.  అందరికీ థ్యాంక్స్.. అర్జున్ అవార్డు గ్రహీతలకు అభినందనలు'' అని పేర్కొన్నాడు.

భార‌త టీ20 జ‌ట్టులోకి రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్..

 

A memorable moment for pacer Mohd. Shami who is conferred with the prestigious Arjuna Award by the President of India, Smt. Droupadi Murmu at the National Sports Awards 👏🏆 | | pic.twitter.com/zYXldurEU1

— BCCI (@BCCI)

2023 ప్రపంచకప్ లో తొలి నాలుగు మ్యాచుల్లో మహ్మద్ షమీ బెంచ్ కు ప‌రిమిత‌మ‌య్యాడు. బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడటంతో న్యూజిలాండ్ మ్యాచ్ కు షమీకి భారత ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కింది. కివీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన షమీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమీ 24 వికెట్లు పడగొట్టాడు.

ఇటీవల క్రీడా మంత్రిత్వ శాఖ వివిధ అవార్డులకు క్రీడాకారుల పేర్లను ఎంపిక చేసింది. స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ సహా 26 మంది క్రీడాకారులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. వారిలో అజయ్ రెడ్డి (అంధుల క్రికెట్), ఓజాస్, అదితి స్వామి (ఆర్చరీ), శీతల్ దేవి (పారా ఆర్చరీ), పారుల్ చౌదరి, శ్రీశంకర్ మురళి (అథ్లెటిక్స్), మహ్మద్ హుస్ముద్దీన్ (బాక్సింగ్), ఆర్ వైశాలి (చెస్), అంతిక్ పంగల్ (రెజ్లింగ్)లు మంగళవారం అర్జున అవార్డులు అందుకున్నాడు. అలాగే, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు, ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును కబడ్డీ కోచ్ బాస్కరన్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.

అంద‌రూ తాగుబోతులే.. టీమిండియా ప్లేయ‌ర్ల‌పై ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్

click me!