తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భుజంపై మూడో చేయి ఉన్న ఫొటోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం T20 వరల్డ్ కప్-2024ను భారత్ గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ సేన విజయాన్ని అందుకుకొని.. పొట్టి కప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా ఆటగాళ్లకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. క్రికెటర్లకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన రోడ్ షోకు భారీగా అభిమానులు పోటెత్తారు.
అయితే, తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భుజంపై మూడో చేయి ఉన్న ఫొటోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
Three hands on Rohit Sharma. Another mystery to solve. pic.twitter.com/JDdHXlFDmK
— R A T N I S H (@LoyalSachinFan)T20 ప్రపంచ కప్-2024 విజయం తర్వాత స్వామి వివేకానంద స్కూల్ డైరెక్టర్ యోగేష్ పటేల్‌తో దిగిన ఫోటోలో రోహిత్ శర్మ భుజంపై మిస్టీరియస్ 'థర్డ్' హ్యాండ్‌ని ఫ్యాన్స్ గుర్తించారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్ వీధుల్లో ఎంఎస్ ధోని, ఇతర టీమిండియా క్రికెటర్లు నడుస్తున్నట్లు... రిషబ్ పంత్ భుజంపై ఒక రహస్యమైన చేయి ఉన్నట్లు 2019లో వైరల్ అయిన ఫొటోను అభిమానులు ఇప్పటికీ మర్చిపోరు. అదేవిధంగా, స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ యోగేష్ పటేల్‌తో రోహిత్ శర్మ ఉన్న ఫొటోలో మూడో చేయి కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రోహిత్ శర్మ చిన్నతనంలో వివేకానంద స్కూల్‌లో ఉచితంగా చదువు చెప్పేందుకు సహాయం చేశారు యోగేష్. ఇలా బాల్యం నుంచి యోగేష్, రోహిత్ ఒకరికొకరు పరిచయం. టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం యోగేస్‌ని కలిసి రోహిత్ శర్మ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ శరీరం ముందు యోగేష్ కుడి చేయి కనిపిస్తుండగా... రోహిత్ రెండు భుజాలపై రెండు చేతులు ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు అయోమయంలో పడ్డారు. సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తున్నారు. అయితే, అవి ఎడిటెడ్ ఫొటోలని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అయితే, ఈ ‘మిస్టీరియస్ థర్డ్ హ్యాండ్’ ఫొటో వైరల్‌గా మారిన తర్వాత యోగేష్, రోహిత్ శర్మ ఉన్న మరికొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోల్లో రోహిత్ శర్మ, యోగేష్ వెనుక మరో వ్యక్తి నిల్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫొటోలు వెలుగుచూశాక.. యోగేష్ పటేల్‌తో రోహిత్ శర్మ ఫొటో వెనుక మిస్టరీ వీడింది. రోహిత్‌పై మూడో చేయి వేలికి ఉన్న ఉంగరాన్ని, ఆ తర్వాత మరో ఫొటోలు వ్యక్తి చేతికి ఉన్న ఉంగరాన్ని గమనిస్తే నిజం ఇట్టే తెలిసిపోతుంది.
The mystery behind Rohit Sharma’s picture with Yogesh Patel has been solved. Notice the ring on the finger! 👀
Please like and repost as much as possible! 🙏 pic.twitter.com/kDes0VQOTS