IPL 2024, SRH vs RR: ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్ కు వెళ్తుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. పిచ్ రిపోర్టులు, గత మ్యాచ్ రికార్డులు గమనిస్తే..
Rajasthan Royals vs Sunrisers Hyderabad : ఐపీఎల్2024 క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టు ఇంటికి వెళ్తుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 26న చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఐపీఎల్ ఫైనల్ ఆడుతుంది. ఉత్కంఠను రేపుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండనుంది? టాస్ గెలిచిన జట్టు ముందుకు బ్యాటింగ్ దిగుతుందా? లేక బౌలింగ్ చేస్తుందా? ఇలా గత రికార్డులు ఏం గమనిస్తే మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.
టాస్ గెలిస్తే బౌలింగ్ లేక బ్యాటింగ్ చేయాలా?
undefined
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ స్లో స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ స్పిన్నర్లకు బంతి అనుకూలంగా ఉంటుంది. కానీ, మ్యాచ్ ప్రారంభంలో ఈ విషయంలో లాభించదు. కాబట్టి చెన్నై పిచ్‌పై టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవడం మంచిది ఛాన్స్.. ఎందుకంటే ఆట సాగుతున్న కొద్దీ ఇక్కడి పిచ్ స్పిన్ బౌలర్లకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది.
ఓ విరాట్ కోహ్లీ ముందు నువ్వు ఆ పనిచేయ్యవయ్యా సామి.. అప్పుడే ఐపీఎల్ కప్పు గెలుస్తావ్.. !
ఇదే సమయంలో ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్‌పై తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడడం కష్టం. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 164 పరుగులు. ఐపీఎల్ 2024లో ఇక్కడ చాలా ఎక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లు గతంలో చూశాము. 200 కంటే ఎక్కువ స్కోర్లు కూడా చేయబడ్డాయి కానీ, చాలా తక్కువ. లక్ష్యాన్ని ఛేదించే జట్టు ఇక్కడ గత 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది.
చెపాక్ స్టేడియం రికార్డులు గమనిస్తే..
చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 83 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. 83 మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 35 మ్యాచ్‌లు లక్ష్యాన్ని ఛేదించడంలో విజయం సాధించింది. ఈ మైదానంలో చేసిన అతిపెద్ద స్కోరు 246 పరుగులు. కాగా ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 164 పరుగులు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంఏ చిదంబరం స్టేడియంలో మొత్తం 10 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ గ్రౌండ్ లో 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలు మాత్రమే నమోదు చేయగా, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
చెన్నై వెదర్ ఎలా ఉండనుంది?
ప్రస్తుతం అందుతున్న వాతావరణ శాఖ రిపోర్టుల ప్రకారం.. మే 24న చెన్నైలో వర్షం పడే అవకాశం తక్కువ. శుక్రవారం కేవలం 2 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ కు వర్షం అడ్డంకి అసలు ఉండదని తెలుస్తోంది. అయితే, మ్యాచ్ సమయంలో మేఘావృతమై వాతావరణం ఉండవచ్చు. ఈ సమయంలో చెన్నైలో ఉష్ణోగ్రత 30 నుండి 35 డిగ్రీల మధ్య ఉంటుంది.