హైద‌రాబాద్ దెబ్బ‌కు ముంబైకి దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాక్ అయింది.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 27, 2024, 9:31 PM IST

Hyderabad vs Mumbai Indians : ఐపీఎల్ 2024 లో ముంబైతో జరిగిన మ్యాచ్ లో హైద‌రాబాద్ బౌండ‌రీల‌తో స‌రికొత్త రికార్డు సృష్టించింది. అలాగే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టీమ్ గా మ‌రో ఘ‌న‌త సాధించింది. 
 


Travis Head - Abhishek Sharma : అబ్బబ్బ ఏం మ్యాచ్ ఇది.. దెబ్బకు దిమ్మదిరిగిపోయి బోమ్మ కనబడాలి అనే డైలాడ్ వినే వుంటారు..అలాగే, జరిగింది ఐపీఎల్ 2024 8వ మ్యాచ్ లో... ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ దుమ్మురేపింది. బౌండ‌రీల వ‌ర్షం కురిపిస్తూ ముంబై బౌలింగ్ ను ఆటాడుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో ట్రావిస్ హెడ్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఆ త‌ర్వాత అభిషేక్ శ‌ర్మ దుమ్మురేపాడు. వీరిద్దరూ పెవిలియన్ కు చేరిన త‌ర్వాత హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్ ర‌మ్ ముంబై బౌల‌ర్ల‌పై సునామీల విరుచుకుప‌డ్డారు. దీంతో హైద‌రాబాద్ టీమ్ కొత్త రికార్డులు న‌మోదుచేసింది. 

ఈ మ్యాచ్ లో మొద‌ట ట్రావిస్ హెడ్ సునామీల విరుచుకుప‌డి ఈ సీజ‌న్ లో అత్యంత వేగ‌వంత‌మైన మొద‌టి హాఫ్ సెంచ‌రీ (18 బంతుల్లో) కొట్టాడు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌ర్వాత ట్రావిస్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శ‌ర్మ ఏకంగా 16 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టి చ‌రిత్ర సృష్టించాడు.  అభిషేక్ శ‌ర్మ 23 బంతుల్లో 63 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు.

Latest Videos

undefined

ట్రావీస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు ఔట్ అయిన త‌ర్వాత ఐడెన్ మార్క్ర‌మ్, హెన్రిచ్ క్లాసెన్ లు ముంబై బౌలింగ్ దుమ్ము దులిపారు. అద్బుతమైన షాట్లు, ఫోర్లు సిక్స‌ర్లతో విరుచుకుప‌డ‌టంతో హైద‌రాబాద్ టీమ్ 250 మార్కును దాటింది. ఈ క్ర‌మంలోనే హెన్రిచ్ క్లాసెన్ త‌న హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ట్రావీస్ హెడ్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో ఐడెన్ మార్క్ రమ్ సైతం బ్యాట్ తో అదరగొట్టాడు. 28 బంతుల్లో 42 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.  హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 277/3 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఒక జట్టుగా బెంగళూరు సాధించిన అత్యధిక స్కోర్ రికార్డును హైదరాబాద్ బ్రేక్ చేసింది. 

 

278 is the target for Mi! pic.twitter.com/WxXEjstFhf

— SunRisers OrangeArmy Official (@srhfansofficial)

MI VS SRH : ముంబై బౌలింగ్ ను తీన్మార్ ఆడేసిన హైద‌రాబాద్.. బౌండ‌రీలతో ద‌ద్ద‌రిల్లిన స్టేడియం.. ! 

click me!