CSK vs GT Highlights : బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొట్టి.. గుజరాత్ ను చిత్తు చేసిన చెన్నై !

By Mahesh RajamoniFirst Published Mar 27, 2024, 1:03 AM IST
Highlights

CSK vs GT Highlights : ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి త‌మ‌కు తిరుగులేద‌ని చెన్నై నిరూపించింది. 
 

Chennai Super Kings vs Gujarat Titans : ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ 2024 7వ మ్యాచ్ లో  గుజరాత్ టైటాన్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. చెన్నై టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టింది. ఈ సీజ‌న్ లో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024 పాయింట్స్ టెబుల్ లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత‌ గుజరాత్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నౌ సూప‌ర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ర‌చిన్ ర‌వీంద్ర‌, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే లు ధ‌నాధన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు.

చివరికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సీఎస్‌కే 206 పరుగులు చేసింది. చెన్నై ఆట‌గాళ్ల‌లో రుతురాజ్ గైక్వాడ్ 46 పరుగులు, రచిన్ రవీంద్ర 46, శివమ్ దూబే 51 , డారెల్ మిచెల్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నాడు. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ త‌గిలింది. గిల్ కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా 21 ప‌రుగులు, సాయి సుద‌ర్శ‌న్ 37 ప‌రుగులు చేశారు. ఇక విజయ్ శంకర్ 12 బంతుల్లో ఒక సిక్సర్ సహా 12 పరుగులు మాత్రమే చేసి, వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ 21 పరుగుల వద్ద అవుట్ కాగా, అస్మదుల్లా ఉమర్జాయ్ 11, రాహుల్ ద్వివేదియా 6, రషీద్ ఖాన్ 1 పరుగుల వద్ద వరుసగా ఔటయ్యారు. ఇందులో తమాషా ఏంటంటే.. తమిళనాడు ప్లేయర్ సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రంగంలోకి దిగాడు. 31 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరి వరకు ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. ఇక గుజరాత్ జట్టు విషయానికి వస్తే 3 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో టెస్ట్ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్న గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసి 63 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా చెన్న త‌న‌ సొంత మైదానంలో 2వ విజయం సాధించింది. అంతే కాకుండా గుజరాత్ టైటాన్స్‌ను లీగ్ మ్యాచ్‌లో ఎన్నడూ ఓడించని చరిత్రను ఎల్లో బాయ్స్ తిరగరాశారు. సీఎస్‌కే జట్టులో దీపక్‌ సహార్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాబిజుర్‌ రెహమాన్‌ తలో 2 వికెట్లు తీశారు. డారిల్ మిచెల్, మదిషా పత్రానా ఒక్కో వికెట్ తీశారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024 పాయింట్ల ప‌రంగా చెన్నై టాప్ లో కొన‌సాగుతోంది. 

గుజ‌రాత్ వ‌ర్సెస్ చెన్నై హైలెట్స్.. 

చెన్నై సూప‌ర్ కింగ్స్ :

రుతురాజ్ గైక్వాడ్ - 46
రచిన్ రవీంద్ర - 46
శివం దూబే - 51
రషీద్ ఖాన్  - 2 వికెట్లు

గుజరాత్ టైటాన్స్ : 

సాయి సుదర్శన్ - 37
సాహా - 21 పరుగులు
దీపక్ చాహర్, ముస్తిఫిజూర్ రెహ్మన్, తుషార్ దేశ్ పాండే లు తల రెండు వికెట్లు తీసుకున్నారు. 
CSK VS GT : సింహంలా దూకి క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టిన ధోని.. ! వీడియో

click me!