అవెంజర్స్‌లో ఇకనుంచి హిట్ మ్యాన్ కూడా: రోహిత్ పై పాండ్యా ఆసక్తికర ట్వీట్

By Arun Kumar PFirst Published Apr 27, 2019, 3:46 PM IST
Highlights

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు.  ఈ పేరుకు తగ్గట్లుగానే అతడు క్రీజులో కుదరుకున్నాడంటే ప్రతి బంతిని బౌండరీ బయటకు తరలించాలని చూస్తుంటాడు. అయితే ఐపిఎల్ సీజన్ 12 ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా రోహిత్ హిట్టింగ్ ను అభిమానులు చూడలేకపోయారు. ఆ లోటును భర్తీ చేస్తూ శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ చెలరేగిపోయాడు. అద్భుతమైన షాట్లతో అర్థశతకాన్ని నమోదుచేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇలా రోహిత్ క్రికెట్ ప్రియులను తన హిట్టింగ్ తో అలరించగా ప్రపంచవ్యాప్తంగా సీనీ ప్రియులను అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా అలరించింది. ఈ   సినిమా కూడా శుక్రవారమే ప్రేక్షకులముందుకు రాగా రోహిత్ కూడా ఇదేరోజు ఫామ్ లోకి వచ్చాడు. దీంతో ఈ రెండింటిని పోలుస్తూ ముంబై ఇండియన్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. 

హిట్ మ్యాన్ రోహిత్ ను అవెంజర్స్ లో జాయిన్ అవ్వాల్సిన సమయం ఇదేనంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో చెన్నై బౌలర్లను  అతడు అడ్డుకున్న తీరు అద్భుతమన్నాడు. మొత్తంగా సొంత గడ్డపైనే చెన్నైని తమ జట్టు ఓడించిన విధానం  అద్భుతంగా వుందని పాండ్యా ట్వీట్ చేశాడు. 

చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట ముంబై జట్టు బ్యాటింగ్ దిగింది. అయితే బ్యాట్ మెన్స్ అందరూ విఫలమవుతున్న సమయంలో రోహిత్ ఒక్కడే బ్యాటింగ్ బాధ్యతను భుజాలపై వేసుకుని 3 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 48 బంతుల్లో 67 పరుగులు చేశాడు. దీంతో ముంబై గెలుపుకోసం పోరాడగలిగేలా 155 పరుగులు చేసింది. దీన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన చెన్నైని లసిత్ మలింగ కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఆ జట్టు నడ్డివిరిచి కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు. ఇలా ముంబై చేతిలో చెన్నై చిత్తుగా ఓడింది.      

Time for the Hitman to join the Avengers 😜 Amazing win in Chennai 💥 pic.twitter.com/vxoE1lXdug

— hardik pandya (@hardikpandya7)

మరిన్ని వార్తలు

కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... అరుదైన రికార్డు బద్దలు

మలింగ మాయాజాలం...ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై

click me!