కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... అరుదైన రికార్డు బద్దలు

By Arun Kumar PFirst Published Apr 27, 2019, 2:18 PM IST
Highlights

ఐపిఎల్ 12 లో శుక్రవారం మరో రసవత్తర పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికయ్యింది. ఈ టోర్నీటో టాప్ జట్లయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో ముంబైదే పైచేయిగా నిలిచింది. ఇలా ముంబై ఘన విజయం సాధించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సహచరులందరు బ్యాటింగ్ లో విఫలమైన సమయంలో రోహిత్ ఒంటరిగానే ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇలా తన ఐపిఎల్ కెరీర్లో మరో హాఫ్ సెంచరీని సాధించడంతో పాటు జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 

ఇలా చెన్నైపై సాధించిన అర్థశతకంతో రోహిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అత్యధిక హాఫ సెంచరీలు సాధించిన రికార్డు ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ, సన్ రైజర్స్ ప్లేయర్ డేవిడ్ వార్నర్,ప్రస్తుత డిసి ఆటగాడు శిఖర్ ధావన్ పేరిట వుంది.  వీరు ఇప్పటివరకు చెన్నై జట్టుపై ఆరు హాఫ్ సెంచరీలు సాధించగా వారి రికార్డును బద్దలుకొడుతూ రోహిత్ ఏడో అర్థశతకాన్ని నమోదుచేశాడు. మొత్తంగా ఈ సీజన్ లో అతడికిది మొదటి అర్థశతకం. 

చెన్నై సొంత మైదానం చెపాల్ లో జరిగిన మ్యాచ్ లో మొదట ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాట్ మెన్స్ అందరూ విఫలమవుతున్న సమయంలో రోహిత్ ఒక్కడే బ్యాటింగ్ బాధ్యతను భుజాలపై వేసుకుని 3 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 48 బంతుల్లో 67 పరుగులు చేశాడు. దీంతో ముంబై గెలుపుకోసం పోరాడగలిగేలా 155 పరుగులు చేసింది. దీన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన చెన్నైని లసిత్ మలింగ కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఆ జట్టు నడ్డివిరిచి కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు. ఇలా ముంబై చేతిలో చెన్నై చిత్తుగా ఓడింది. 

సంబంధిత వార్తలు 

మలింగ మాయాజాలం...ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై
 
click me!