MIvsCSK: నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... ఇషాన్ కిషన్ అవుట్...

By Chinthakindhi RamuFirst Published Sep 19, 2021, 10:28 PM IST
Highlights

తీవ్రంగా నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ టాపార్డర్... డి కాక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఫెయిల్...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా చెన్నై సూపర కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది... 157 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కి మూడో ఓవర్‌లోనే తొలి షాక్ తగిలింది.

12 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన డి కాక్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన సీఎస్‌కేకి అనుకూలంగా ఫలితం వచ్చింది...

ఆ తర్వాత మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న ఆన్‌మోల్ ప్రీత్ సింగ్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి... దీపక్ చాహార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 7 బంతుల్లో 3 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను, డుప్లిసిస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు...

ఆ తర్వాత ఇషాన్ కిషన్ 10 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ కావడంతో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై ఇండియన్స్... 11 ఓవర్లు ముగిసే సరికి 75 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, విజయానికి ఆఖరి 9 ఓవర్లలో 82 పరుగులు చేయాల్సి ఉంటుంది. 

click me!