GT vs MI: క్వాలిఫయర్2కి దూసుకెళ్లిన ముంబయి .. గుజరాత్‌పై భారీ విజయం

Published : May 30, 2025, 11:49 PM ISTUpdated : May 31, 2025, 12:00 AM IST
Mumbai Indians. (Photo- IPL)

సారాంశం

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ అద్భుత విజయంతో క్వాలిఫయర్-2కు ప్రవేశించింది. గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీలో జరిగిన కీలక పోరులో ముంబయి జట్టు 20 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో గుజ‌రాత్ టోర్నీ నుంచి త‌ప్పుకుంది.

కాగా ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగులు చేసి ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడు 43 బంతుల్లో 81 పరుగులు సాధించడంతో ముంబయి భారీ స్కోరు చేయగలిగింది. అతనికి తోడుగా మిడిలార్డర్‌లోని బ్యాటర్లు కూడా ప‌రుగులు సాధించారు.

అనంతరం చేజింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ మంచి ప్రయత్నం చేసినప్పటికీ విజయానికి చేరలేకపోయింది. గుజరాత్‌ జట్టు 20 ఓవర్లలో 208 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ మరోసారి ఆకట్టుకున్నాడు. అతను 80 పరుగులు చేసి చివరి వరకూ పోరాడినా విజయం అందుకోలేకపోయాడు.

 

 

ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, గ్లీసన్, అశ్వినీ ఒక్కో వికెట్‌ చొప్పున పడగొట్టారు. ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది, ఇక జూన్ 1న ముంబయి ఇండియన్స్‌ క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

కాగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి మంచి స్కోర్ సాధించింది.  రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. జానీ బెయిర్‌స్టో (47; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (33; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (25; 11 బంతుల్లో 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (22*; 9 బంతుల్లో 3 సిక్స్‌లు) తో స్కోర్ బోర్డును పరుగుపెట్టించాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది