Sai Sudharsan: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో మ‌రో రికార్డు.. సుద‌ర్శ‌న్ ఘ‌న‌త

Published : May 30, 2025, 10:52 PM IST
sai sudharsan gt

సారాంశం

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో స‌రికొత్త రికార్డులు న‌మోద‌వుతున్నాయి. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మార్క్‌ను అధిగమించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించగా.. 

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఐపీఎల్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. ఒకే సీజన్‌లో 700కి పైగా పరుగులు సాధించిన తొమ్మిదవ ఆటగాడిగా చరిత్రలో చేరారు.

ఈ ఘనతను ముంబై ఇండియన్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో సాధించారు. ఐపీఎల్ 2025లో 700 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ఆటగాడు కూడా సుదర్శనే, అందుకే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా ఆయన వద్దనే ఉంది.

ముంబైపై మ్యాచ్‌కు ముందు సుదర్శన్ ఇప్పటికే 14 మ్యాచ్‌ల్లో 679 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేయగానే ఆయన 700 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

ఇందుకు ముందు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మాత్రమే ఒక ఐపీఎల్ సీజన్‌లో 700కి పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు. ఇప్పుడు సాయి సుదర్శన్ కూడా ఆ జాబితాలో చేరారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జానీ బెయిర్ స్టో(22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 33), హార్దిక్ పాండ్యా(9 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !