MS Dhoni : రుచికరమైన ఆహారం కోసం పాకిస్తాన్‌కు వెళ్లండి.. అభిమానికి మాజీ కెప్టెన్ స‌ల‌హా..! వీడియో వైర‌ల్‌

By Rajesh KarampooriFirst Published Dec 30, 2023, 2:36 AM IST
Highlights

MS Dhoni: భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇంతకీ ఆ వీడియో ఏంటీ? ఆ వీడియో ఎందుకు వైరలవుతోంది. 
 

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా మాజీ కెప్టెన్. ఆయనకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో అభిమానులున్నారు. ఆయన వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికినా ఫాలోయింగ్ మాత్రం అసలు తగ్గడమే లేదు. ఆయన అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అతని అభిమానులు కూడా సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన వివిధ రకాల పోస్ట్‌లను షేర్ చేస్తూనే ఉన్నారు. అతనిని కలవడానికి ప్రజలు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇంతకీ ఆ వీడియో ఏంటీ? ఆ వీడియో ఎందుకు వైరలవుతోంది. 


ధోనీ తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నిలో సార్లు పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించాడు. ఆ సంద‌ర్భంలో అక్క‌డి వంట‌కాల‌ను రుచి చూశాడు. ఆ సంద‌ర్భంలో వాటిని ప్ర‌శంసించాడు కూడా. అక్క‌డి ఆహారం త‌న‌కు న‌చ్చుతుంద‌ని చెప్పాడు. తాజా వీడియోలో ధోని ఓ హోట‌ల్ రిసెప్ష‌న్ వ‌ద్ద నిల‌బ‌డి ఉన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మహేంద్ర సింగ్ ధోనీ ఒక వ్యక్తితో ..మీరు ఒకసారి తినడానికి పాకిస్తాన్ వెళ్లండి' అని చెప్పడం కనిపిస్తుంది. అయితే.. ధోనీ ఈ సూచనను ఆ అభిమాని తిరస్కరించారు. 'మీరు మంచి ఆహారం సూచించినా.. నేను అక్కడికి వెళ్లను. నాకు ఆహారం ఇష్టం, కానీ నేను అక్కడికి వెళ్లను. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

Latest Videos

ప్రజలు ఏం చెప్పారు?

ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో @Sports_Himanshu అనే ఖాతాతో షేర్ చేయబడింది. 'ఎంఎస్ ధోనీ, 'మీరు ఒకసారి తినడానికి పాకిస్తాన్‌కు వెళ్లండి, ఇది అద్భుతంగా ఉంది' అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మందికి పైగా వీడియోను వీక్షించారు. మరోవైపు ఈ వీడియో చూసిన తర్వాత పలువురు వినియోగదారులు  భిన్నంగా స్పందిస్తున్నారు. ఎవరూ పాకిస్తాన్‌కు వెళ్లాలని అనుకోరు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు - బ్రదర్, మనం తిన్న తర్వాత తిరిగి రావాలి. బాంబు ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలుసు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు - పాకిస్తాన్‌లో పిండి కొరత ఉంది, మహి భాయ్‌కి ఎవరు చెబుతారు. అని కామెంట్ చేశారు. 

click me!