అద్భుత విజయం.. రుతురాజ్ పై ధోనీ ప్రశంసల వర్షం..!

By telugu news teamFirst Published Sep 20, 2021, 8:26 AM IST
Highlights

 సరిగ్గా ఆ సమయంలో క్రీజులో నిలిచిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చక్కని బ్యాటింగ్ తో జట్టు కి అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు.  ఇక చివరల్లో వచ్చిన బ్రావో కూడా అదరగొట్టాడు. 

ఐపీఎల్-14 సీజన్ మళ్లీ మొదలైంది. ఆదివారం ముంబయి ఇండియన్స్ తో జరిగిన రసవత్తర పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ అధ్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(88 నాటౌట్) అదరగొట్టేశాడు. చెన్నై విజయానికి రుతురాజ్ చేసిన సహకారం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో.. విజయానంతరం రుతురాజ్ పై కెప్టెన్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు.

తొలుత చెన్నై తమ బ్యాటింగ్ తో నిరాశపరిచింది. కీలక సమయంలో.. రాయుడు కూడా గాయంతో వెనుదిరగడంతో.. మ్యాచ్ చేజారినట్లేనని చెన్నై అభిమానులు నిరాశపడ్డారు. కానీ.. సరిగ్గా ఆ సమయంలో క్రీజులో నిలిచిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చక్కని బ్యాటింగ్ తో జట్టు కి అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు.  ఇక చివరల్లో వచ్చిన బ్రావో కూడా అదరగొట్టాడు. ఎనిమిదో ఆటగాడుగా క్రీజులోకి అడుగుపెట్టిన బ్రావో.. కేవలం 8 బంతులకే  23 పరుగులు సాధించాడు. ఇది కూడా జట్టు స్కోర్ పెరగడానికి సహకరించింది. చివరకు ముంబయి ఇండియన్స్ పై 20 బంతుల ఆధిక్యంతో విజయం సాధించింది.


కాగా.. జట్టు విజయం తర్వాత తన అభిప్రాయాన్ని  ధోనీ వివరించారు. తాను ఊహించినదానికంటే రుతురాజ్, బ్రావోలు అద్భుతంగా ఆఢారాని ధోనీ పేర్కొన్నారు. వారి నుంచి తాను ఎక్స్ పెక్ట్ చేసినదానికంటే వారు ఎక్కువగా ఇఛ్చారని ధోనీ ఆనందం వ్యక్తం చేశారు. చేజారి పోతుందనుకున్న మ్యాచ్ ని  రుతురాజ్, బ్రావో లు వారి ఆటతో గెలిపించారని ధోనీ ఆనందం వ్యక్తం చేశారు.

ఇక మ్యాచ్ మధ్యలో గాయపడిన అంబటి గురించి కూడా ధోనీ స్పందించాడు. తదుపరి మ్యాచ్ నాటికి అంబటి రాయుడు కోల్కోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఏది ఏమైనా ఐపీఎల్ సెకండ్ ఫేస్ లో,. మొదటి మ్యాచ్ చెన్నై గెలవడం తలైవా ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. 

click me!