మహ్మద్ సిరాజ్ మ్యాజిక్... వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు...

Published : Aug 13, 2021, 08:50 PM IST
మహ్మద్ సిరాజ్ మ్యాజిక్... వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు...

సారాంశం

టీ బ్రేక్ తర్వాత వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన హసీబ్ హమీద్ గోల్డెన్ డకౌట్...

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. టీమిండియాను 364 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత 14 ఓవర్లు బ్యాటింగ్ చేసి, వికెట్ కోల్పోకుండా 23 పరుగులతో టీ బ్రేక్‌కి వెళ్లిన ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు...

టీ బ్రేక్ తర్వాత మూడో సెషన్‌లో ఓపెనింగ్ బౌలింగ్‌కి వచ్చిన రెండో బంతికే వికెట్ తీశాడు. 44 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, సిరాజ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే హసీబ్ హమీద్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.

సిరాజ్ బౌలింగ్‌లో మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు హమీద్. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసి, నాలుగేళ్ల తర్వాత తుదిజట్టులోకి వచ్చిన హసీబ్ హమీద్... తొలి బంతికే అవుటై నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్, సిరాజ్‌కి హ్యాట్రిక్ దక్కకుండా చేశాడు.

అయితే 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 340 పరుగుల దూరంలో ఉంది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన జో రూట్ వికెట్ తీస్తే, ఈ టెస్టుపై పట్టు సాధించే అవకాశం టీమిండియాకి దక్కుతుంది.   

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే