ధోని డీజిల్ ఇంజిన్ లాంటోడు.. మహీ రిటైర్ పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమై కామెంట్స్ !

By Mahesh Rajamoni  |  First Published Mar 14, 2024, 5:18 PM IST

AB de Villiers comments on MS Dhoni: గత కొన్నేళ్లుగా ధోనీ వయసు రీత్యా ఎప్పుడు రిటైర్ అవుతాడనే చర్చలు జరుగుతున్న క్రమంలో గతేడాది చివర్లో ధోనీ అభిమానుల ప్రేమ, ఆప్యాయత కోసం మరో ఏడాది పాటు ఆడతానని చెప్పాడు. దీంతో ఐపీఎల్ 2024 చివ‌రిదిగా భావిస్తుండ‌గా, ధోని డిజిల్ ఇంజిన్ లాంటోడు అంటూ ఏబీ డివిలియ‌ర్స్ చేసిన కామెంట్ వైర‌ల్ అవుతున్నాయి. 
 


Tata IPL 2024:  భార‌త్ లోని మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దిగ్గ‌జ ప్లేయ‌ర్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇప్పటికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు కానీ, ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టుకు కెప్టెన్‌గా ధోని నాయ‌క‌త్వంలో ఆ జట్టు ఇప్పటి వరకు 5 ట్రోఫీలు గెలుచుకుంది.

అయితే, గత కొన్నేళ్లుగా ధోనీ వయసు రీత్యా ఎప్పుడు రిటైర్ అవుతాడనే చర్చలు జరుగుతున్నా త‌రుణంలో.. గతేడాది చివర్లో ధోనీ అభిమానుల ప్రేమ, ఆప్యాయత కోసం మరో ఏడాది పాటు ఆడతానని చెప్పాడు. దీంతో ఐపీఎల్ 2024 చివ‌రిదిగా భావిస్తుండ‌గా, ధోని డిజిల్ ఇంజిన్ లాంటోడు అంటూ సౌతాఫ్రికా దిగ్గ‌జ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ చేసిన కామెంట్ వైర‌ల్ అవుతున్నాయి. ఐపీఎల్ 2024తో ధోని రిటైర్ అవుతాడో లేదో ఎవరికీ తెలియదని ఏబీడీ అన్నాడు. అయితే ఎప్పుడూ డీజిల్ ఇంజన్ లా పరుగులు తీసే ధోనీ ఈసారి బాగా ఆడి చెన్నైకి 6వ ట్రోఫీని అందించే అవకాశం ఉందని డివిలియర్స్ పేర్కొన్నాడు.

Latest Videos

ఘోర కారు ప్రమాదనికి గురైన ప్రపంచ ఛాంపియన్ క్రికెటర్..

ఏబీడీ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. "గత సంవత్సరం చెన్నై సూప‌ర్ కింగ్స్ గొప్ప క్రికెట్ ఆడింది. ఎంఎస్ ధోని ఈ సంవత్సరం రిటైర్ అవుతాడని పుకార్లు ఉన్నాయి. అతను మళ్లీ ఆడతాడు. అతను ఈ సంవత్సరం పూర్తి చేస్తాడో లేదో ఎవరికీ తెలియదు. ఎప్పుడు రిటైర్ అవుతాడో తెలియ‌దు. ధోని డీజిల్ ఇంజిన్ లాంటోడు. గొప్ప ఆటగాడు.. నిత్యం పరుగులెత్తే గొప్ప కెప్టెన్. కెప్టెన్‌గా ధోనీ, కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్, జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు చెన్నై జట్టు సంస్కృతిని సజీవంగా ఉంచుతారని నేను నమ్ముతున్నాను. వారిని ఓడించడం అంత సులభం కాదు" అని అన్నాడు.

గతేడాది ట్రోఫీని గెలుచుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంద‌న్నాడు. ధోనీపైనా, అతని ఆటగాళ్లపైనా ప్ర‌స్తుతం ఎలాంటి ఒత్తిడి లేదనీ, ఇది వారు రాబోయే ఐపీఎల్ లో మ‌రింత ప్రభావ‌వంతంగా ఆడ‌టానికి అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని తెలిపాడు. ఐపీఎల్ 2024 టైటిల్ ను గెలుచుకునే అవ‌కాశాలు చెన్నై టీమ్ అధికంగానే ఉన్నాయ‌ని ఏబీ డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు.

IPL 2024 : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై యువ‌రాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ !

click me!