IPL 2024 - Yuvraj Singh : ముంబై మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మకు మరో ఏడాది సమయం ఇచ్చి ఉండాల్సిందని భారత్ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ మార్పుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
Tata IPL 2024 : దేశవాళీ మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై-బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే, గతంలో 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఈ ఏడాది రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. దీనిపై ఇప్పటికే పలువురు ముంబై అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినట్లు ముంబై మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
అయితే, ఇప్పటికే పలువురు ముంబై నిర్ణయాన్ని ఎత్తిచూపగా, తాజాగా భారత ప్రపంచ కప్ ఇన్నింగ్స్ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ముంబై టీమ్ రోహిత్ శర్మకు కెప్టెన్‌గా మరో ఏడాది సమయం ఇచ్చి ఉండాల్సిందని పేర్కొంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 2022 ఐపీఎల్ కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ పై ఎలాంటి అంచనాలు లేని సమయంలో హార్దిక్ పాండ్యా ట్రోఫీని గెలుచుకున్నాడని యువరాజ్ చెప్పాడు. కానీ ఇప్పటికే 5 ట్రోఫీలు గెలిచిన ముంబై.. కోట్లాది మంది అభిమానులతో భారీ ఒత్తిడి, అంచనాలతో కూడిన జట్టు అని యువీ అన్నాడు. కాబట్టి ఆ జట్టులో భారత కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లను కాదనీ, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ తగదనీ, ఐపీఎల్ ట్రోఫీని గెలవడం కష్టమని పేర్కొన్నాడు.
"రోహిత్ శర్మ కెప్టెన్‌గా 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. అతనిని కెప్టెన్సీ నుంచి డ్రాప్ చేయడం చాలా పెద్ద నిర్ణయం. అది నేనే అయినా, నేను పాండ్యా లాంటి వ్యక్తిని తీసుకువస్తాను. కానీ అంతకంటే ముందు నేను రోహిత్ శర్మకు ఒక సంవత్సరం సమయం ఇచ్చి హార్దిక్ పాండ్యాను టీమ్ లోకి తీసుకుంటాను. వైస్ కెప్టెన్ గా ఉంచడం, పనితీరును గమనించడం చేస్తాను" అని యువరాజ్ సింగ్ తెలిపాడు. ముంబై భవిష్యత్తు ప్లాన్స్ అర్థం చేసుకోగలననీ, అయితే, ఇప్పటికీ భారత కెప్టెన్‌గా కొనసాగుతున్నందున రోహిత్ విషయంలో ఇది చాలా పెద్ద నిర్ణయమని తెలిపాడు. "పాండ్యాకు మంచి ప్రతిభ ఉందనీ, గుజరాత్ కెప్టెన్‌గా ఉండటం కంటే ముంబై కెప్టెన్‌గా ఉండటం చాలా డిమాండ్.. ఎందుకంటే ముంబై ఇండియన్స్ చాలా పెద్ద జట్టు" అని యూవీ తెలిపాడు.
RANJI TROPHY FINAL: రంజీ ట్రోఫీ 2024 విజేతగా ముంబై.. ఫైనల్లో విదర్భ చిత్తు !