Lahiru Thirimanne Accident: శ్రీలంక ప్రపంచ ఛాంపియన్ క్రికెటర్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘోర ప్రమాదంలో అతని కారు ముక్కలైంది. ఇది రిషబ్ పంత్ ప్రమాద జ్ఞాపకాలు గుర్తుకు చేస్తోంది.
Lahiru Thirimanne Accident: శ్రీలంక మాజీ క్రికెటర్ లహిరు తిరిమన్నె కారు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం అనురాధపురలోని తిరపన్నె ప్రాంతంలో జరిగింది. లహిరు తిరిమన్నె ప్రయాణిస్తున్న కారు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరిమన్నే కారు ముక్కలు కాగా, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కారు చిత్రాన్ని చూస్తే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అంచనా వేయవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం భారత్ స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం జ్ఞాపకాలను గుర్తుచేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 2022లో ఢిల్లీ నుండి రూర్కీకి వెళ్తుండగా పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన సంగతి తెలిసిందే.
ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు లహిరు తిరిమన్నెను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీలంక మాజీ క్రికెటర్‌కు పెద్దగా గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించే అంశం. ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో తిరిమన్నే న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు. అతను క్షేమంగా ఉన్నారనీ, ఆలయాన్ని సందర్శిస్తుండగా ప్రమాదానికి గురయ్యారని సంబంధిత వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
Ranji Trophy Final: రంజీ ట్రోఫీ 2024 విజేతగా ముంబై.. ఫైనల్లో విదర్భ చిత్తు !
ఫ్రాంచైజీ విడుదల చేసిన ఒక ప్రకటనలో "లహిరు తిరిమన్నె, అతని కుటుంబం ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. చికిత్స కోసం కోసం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి మెరుగైన చికిత్స అందుతున్నదనీ, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు" అని పేర్కొంది. కాగా, గతేడాది వన్డే ప్రపంచకప్‌కు ముందు లహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
IPL 2024 : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ !