MS Dhoni: ఫలితం కంటే ప్రయత్నం గొప్పదన్న ధోని.. బెంగళూరులో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభం

By team telugu  |  First Published Oct 12, 2021, 6:56 PM IST

MS Dhoni Cricket Academy: క్రికెట్ మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోని మెంటార్ గా ఉన్న ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ మంగళవారం బెంగళూరులో ప్రారంభమైంది. ఔత్సాహిక యువ క్రికెటర్లను వెలికితీసి వారికి మెరుగైన శిక్షణ ఇప్పించడమే ధ్యేయంగా దీనిని ఏర్పాటు చేశారు. 


చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సలహాదారుడిగా కర్నాటక రాజధాని బెంగళూరులో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ మంగళవారం ప్రారంభమైంది. ఆర్కా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గేమ్ ప్లే అనే సంస్థ బెంగళూరులో ఈ అకాడమీని స్థాపించింది. ఇవాల గేమ్ ప్లే, ఆర్కా స్పోర్ట్స్ ప్రతినిధులు దీనిని అధికారికంగా లాంచ్ చేశారు.  ఐపీఎల్ కోసం దుబాయ్ లో ఉన్న ధోని.. ఈ సందర్భంగా యువ క్రికెటర్లకు ప్రత్యేక సందేశం పంపాడు. 

ఆ ప్రసంగ పాఠం ధోని మాటల్లోనే.. ‘ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. యువ క్రికెటర్లకు 360 డిగ్రీలలో శిక్షణ ఇప్పించడమే గాక మంచి టెక్నిక్స్, టెక్నాలజీతో వాళ్ల స్కిల్స్ కు మెరుగులుదిద్దడమే ఈ అకాడమీ ఉద్దేశం. క్వాలిఫైడ్ కోచ్ లు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ తో కూడిన మా టీమ్ మీకు అన్నివిధాలుగా అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది. దీనికోసం వెంటనే రిజిస్టర్ చేసుకుని మా అకాడమీలో భాగస్వాములవ్వండి’ అని పేర్కొన్నాడు. 

Latest Videos

undefined

అంతేగాక ఇంకా ధోని స్పందిస్తూ.. ‘యువ క్రికెటర్లందరికీ నాదొక సలహ. ఫలితం కంటే దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. ఫలితం అనేది ప్రయత్నం యొక్క బైప్రొడక్ట్ వంటిది. కానీ నేటి ప్రపంచంలో అందరూ ఫలితం పైనే ఫోకస్ చేసి అందుకు జరగాల్సిన ప్రక్రియను మర్చిపోతున్నారు. కానీ, ఫలితం కోసం చేసే ఆ ప్రక్రియను నేర్చుకోండి. చిన్న చిన్న విషయాల మీద అవగాహన పెంచుకోండి. మనం ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా సక్సెస్ అవుతాం’ అంటూ ధోని తన సందేశంలో తెలిపాడు. 

ధోని అకాడమీ ప్రారంభం సందర్భంగా  గేమ్ ప్లే ఓనర్ దీపక్ భట్నాగర్ మాట్లాడుతూ.. ఈరోజు  తమ సంస్థకే గాక బెంగళూరు ప్రజలకు కూడా శుభదినమని అన్నారు. క్రికెట్ లో రాణించాలనుకునే యువతకు తమ  అకాడమీలో అన్ని సదుపాయాలున్నాయని తెలిపారు. వీలున్నప్పుడల్లా ధోని కూడా ఈ అకాడమీకి వచ్చి విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందజేస్తాడని అన్నారు. 

బెంగళూరు శివార్లలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్రికెట్ అకాడమీ లో అత్యాధునిక సదుపాయాలున్నాయి. 2019లో  గేమ్ ప్లే సంస్థను  స్థాపించిన నిర్వాహకులు.. క్రికెట్ మీద మక్కువ ఉన్న క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో దీనిని  నెలకొల్పారు. 

click me!