mohammed shami... భారత ఆటగాళ్లకు మోడీ ఓదార్పు: సోషల్ మీడియాలో పంచుకున్న మహమ్మద్ షమీ

Published : Nov 20, 2023 3:39 PM ISTUpdated : Nov 20, 2023 4:04 PM IST
 mohammed shami...  భారత ఆటగాళ్లకు మోడీ ఓదార్పు: సోషల్ మీడియాలో పంచుకున్న మహమ్మద్ షమీ

సారాంశం

అస్ట్రేలియా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు ఓటమి పాలు కావడంతో భావోద్వేగానికి గురౌతున్నారు జట్టు సభ్యులు.  అయితే  భారత జట్టు సభ్యులను  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓదార్చారు

న్యూఢిల్లీ: అస్ట్రేలియా జట్టుతో  జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ విషయమై భారత క్రికెట్ జట్టు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయమై  భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ  సోషల్ మీడియా వేదికగా   తన అభిప్రాయాలను పంచుకున్నారు.

దురదృష్టవశాత్తు  నిన్న మన రోజు కాదని మహమ్మద్ షమీ అభిప్రాయపడ్డారు.  టోర్నీ అంతటా భారత జట్టుకు , తనకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికి  మహహ్మద్ షమీ  ధన్యవాదాలు తెలిపారు.  అంతేకాదు  తమ డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి తమను ఉత్సాహపర్చిన  ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి మహమ్మద్ షమీ  ధన్యవాదాలు తెలిపారు.  తాము బౌన్స్ బ్యాక్ అవుతామని మహమ్మద్ షమీ ధీమాను వ్యక్తం చేశారు.

 

ప్రపంచకప్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ లో జరిగిన అన్ని మ్యాచుల్లో  భారత జట్టు ఘనవిజయాలు నమోదు చేసింది. ఈ నెల  19న అహ్మదాబాద్ లో అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో  భారత జట్టు  పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో అస్ట్రేలియాను ఓడించి  కప్ ను కైవసం చేసుకుంటుందని భారతీయులు ఆశించారు. అయితే  ఈ మ్యాచ్ లో భారత్ పై అస్ట్రేలియా జట్టు అన్ని రంగాల్లో రాణించింది. దరిమిలా భారత జట్టు  ఓటమిని మూటగట్టుకుంది.

PREV
Read more Articles on
click me!