సోషల్ మీడియాలో మిచెల్ మార్ష్ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఫైనల్ లో 15 పరుగులు మాత్రమే చేసి.. ఐదు పరుగులు మాత్రమే ఇండియాకు ఇచ్చాడు మిచేల్.
అహ్మదాబాద్‌లో భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీని అగౌరవపరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఫొటోలో మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై తన కాళ్ళను పెట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యింది.
2015 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ ఉన్నాడు. ఆదివారం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆటలో 15 పరుగులు చేశాడు. బౌలింగ్ లో కూడా ఈ ఆల్-రౌండర్ కూడా రెండు ఓవర్లు బౌలింగ్ ఆచీ తూచీ చేశాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత్ ను ఫైనల్‌లో 240 పరుగులకు పరిమితం చేయడంలో తనవంతు కృషి చేశాడు.
undefined
ICC World Cup Final 2023: కంగారూ జట్టుపై కాసుల వర్షం.. విన్నర్ కి ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా..?
నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. పాట్ కమిన్స్ ఈ నిర్ణయం భారత్ ను పెద్ద దెబ్బ కొట్టింది. మాంచి ఫామ్‌లో ఉన్న భారత బ్యాటింగ్ జట్టును 50 ఓవర్లలో 240 పరుగులకు పరిమితం చేసింది. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశారు.
పరుగుల వేటలో మొదట 47 పరుగుల్లోనే ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే అక్కడినుంచి జోరందుకున్నారు. 192 పరుగులు జోడించారు. చివర్లో రెండు పరుగులు మాత్రమే గెలుపుకు అవసరం అయినప్పుడు ఒక వికెట్ పడింది. కానీ ఆ తరువాత గ్లెన్ మాక్స్‌వెల్ విజయవంతమైన పరుగులు సాధించాడు.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra)