Mohammed Shami: ప్రపంచ కప్‌ చరిత్రలో ఈ ఘ‌న‌త సాధించిన ఒకే ఒక్క‌డు మ‌హ్మ‌ద్ షమీ..

By Mahesh RajamoniFirst Published Nov 16, 2023, 5:32 AM IST
Highlights

Mohammed Shami: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో మహ్మద్ షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి భారత్ 70 పరుగుల తేడాతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. షమీ (7/57) వన్డే మ్యాచ్ లో ఏ భారత బౌలర్ చేయని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ ను న‌మోదుచేశాడు.
 

ICC Cricket World Cup 2023: ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. 70 పరుగుల భారీ తేడాతో విజ‌యం సాధించి ఫైనల్ చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్ తో భార‌త క్రీడాకారులు అనేక స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించారు. కింగ్ విరాట్ కోహ్లీ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ అత్య‌ధిక వ‌న్డే సెంచ‌రీల రికార్డును బ్రేక్ చేశారు. విరాట్ కోహ్లీకి వన్డేల్లో 50వ సెంచరీ సాధించాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీతో అద‌ర‌గొట్టాడు. ఇక బౌలింగ్ తిరుగులేని అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన మహ్మద్ షమీ.. త‌న‌ అద్భుత ప్రదర్శనతో స‌త్తా చాటాడు. దీంతో క్రికెట్ ప్ర‌పంచం అత‌నికి స‌లాం చేస్తోంది.

మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌ద‌ర్శ‌న‌పై భార‌తావ‌ని ఉప్పొంగిపోతోంది. బుధవారం ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మహ్మద్ షమీ ప్రపంచ కప్‌లలో నాలుగు సార్లు ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో కీవీస్ కీల‌క ఆట‌గాళ్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీల వికెట్లు సాధించి భార‌త్ విజ‌యం కీల‌క పాత్ర పోషించాడు. మొత్తం 57 ప‌రుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ప్ర‌పంచ క‌ప్ లో ఇది ఒక భారతీయుడిగా అత్యుత్తమ వ‌న్డే బౌలింగ్ గణాంకాలు.

మహ్మద్ షమీ ప్రపంచ కప్‌లలో నాలుగు సార్లు 5 వికెట్ల తీసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ కప్‌లో తన 4వ సారి 5 వికెట్ల ప్రదర్శనతో, షమీ వ‌న్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డును బ్రేక్ చేశాడు. వ‌న్డే ప్రపంచకప్ చరిత్రలో స్టార్క్ మూడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాగే, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. భారత పేసర్ తన 17వ వన్డే ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో మైలురాయిని చేరుకున్నాడు. అలాగే, షమీ ఒక ప్రపంచ కప్ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన మొదటి బౌల‌ర్ గా రికార్డు సృష్టించాడు.

click me!