Mohammed Shami: కోట్లాది హృద‌యాల‌ను దొంగిలించారు.. మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌ద‌ర్శ‌న‌పై ముంబ‌యి, ఢిల్లీ పోలీసులు..

Published : Nov 16, 2023, 04:50 AM IST
Mohammed Shami: కోట్లాది హృద‌యాల‌ను దొంగిలించారు.. మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌ద‌ర్శ‌న‌పై ముంబ‌యి, ఢిల్లీ పోలీసులు..

సారాంశం

Mohammed Shami: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో మహ్మద్ షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. భారత్ 70 పరుగుల తేడాతో సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు.  

ICC Cricket World Cup 2023: ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీకి వన్డేల్లో 50వ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీ, బౌలింగ్ లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో భారత్ ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది. ఈ విజయంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. భారత జట్టుపై విభిన్న రీతిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ట్రెండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు కూడా విస్తరించింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన సందేశాలు, వీడియోలు, మీమ్స్ ను ప్రజలు షేర్ చేస్తున్నారు. విరాట్, మహ్మద్ షమీల ఆటను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబయి, ఢిల్లీ పోలీసుల సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఎక్స్ లో సరదాగా సరదాగా మహ్మద్ ష‌మీ ప్రదర్శనపై ముచ్చటించాయి.

ఢిల్లీ పోలీసులు తమ ఎక్స్ ఖాతాలో మొదటి సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. సరదా సంభాషణను ప్రారంభించారు. అందులో ముంబ‌యి పోలీసులు  ఈ రాత్రి జ‌రిగిన దాడికి మ‌హ్మ‌ద్ ష‌మీపై కేసు నమోదు చేయరని ఆశిస్తున్నామంటూ స‌ర‌దా సంభాష‌న‌ను మొద‌లు పెట్టింది. దీనికి ముంబ‌యి పోలీసుల ఎక్స్ ఖాతా వెంటనే స్పందించింది. కోట్లాది హృదయాలను దొంగిలించి, ఇద్దరు సహ నిందితులను కూడా జాబితా చేసిన ఆరోపణలను మీరు మిస్ అయ్యారు అంటూ టీమ్ ఇండియా ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌పై స‌ర‌దాడా స్పందించింది.

ఆ త‌ర్వాత కొద్దిసేపటికే ముంబ‌యి స్పెషల్ కమిషనర్ దేవన్ భారతి స్పందిస్తూ.. ఇది ఆత్మరక్షణ హక్కు కింద రక్షణకు అర్హత పొందుతుందంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  కాగా, ఐసీసీ వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో మహ్మద్ షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి భారత్ 70 పరుగుల తేడాతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. షమీ (7/57) వన్డే మ్యాచ్ లో ఏ భారత బౌలర్ చేయని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ ను న‌మోదుచేశాడు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ