పాకిస్థాన్ చెత్త రికార్డు.. మహ్మద్ రిజ్వాన్ సరికొత్త ఆల్ టైమ్ టెస్ట్ రికార్డు

By Mahesh Rajamoni  |  First Published Aug 25, 2024, 11:38 PM IST

pak vs ban - Mohammad Rizwan: పాకిస్థాన్-బంగ్లాదేశ్ జ‌ట్లు రావల్పిండి వేదిక‌గా టెస్టు మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. అయితే, ఈ ఓటమి మ్యాచ్ లో పాక్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 


pak vs ban - Mohammad Rizwan: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోర ఓట‌మిపాలైంది. టెస్టు క్రికెట్ లో స్వ‌దేశంలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన జ‌ట్టుగా చెత్త రికార్డును త‌న పేరున లిఖించుకుంది. రావల్పిండిలో జ‌రిగిన ఈ టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ ప్లేయ‌ర్లు అద్భుత‌మైన ఆట‌తో పాకిస్తాన్ పై టెస్టుల్లో తొలి విజ‌యాన్ని అందుకున్నారు. అలాగే, పాక్ ను వారి దేశంలో 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జ‌ట్టుగా కూడా రికార్డు సృష్టించాడు. ఇదిలా వుండ‌గా, ఈ మ్యాచ్ లో మహ్మద్ రిజ్వాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు.

పాక్ తొలి ఇన్నింగ్స్ లో రిజ్వాన్ 171* పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్ర‌మంలోనే త‌న అత్య‌ధిక టెస్టు స్కోర్ తో పాకిస్థాన్ 448 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంలో సహాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా మంచి ప్ర‌ద‌ర్శన చేశాడు. హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక పాక్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రిజ్వాన్ టాప్ స్కోరర్ గా నిలిచినా పాక్ జ‌ట్టును ఓటమిని తప్పించేందుకు మ‌రే ఇత‌ర ప్లేయ‌ర్ల నుంచి స‌హ‌కారం అందుకోలేక‌పోయాడు. దీంతో పాక్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 

Latest Videos

undefined

నా జీవితంలో అవే అత్యంత బాధ‌క‌ర‌మైన క్ష‌ణాలు.. కేఎల్ రాహుల్

స్వదేశంలో టెస్టుల్లో పాకిస్థాన్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసినా ఈ మ్యాచ్ లో రిజ్వాన్  ఆకట్టుకునే ఇన్నింగ్స్ తో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. రెండు ఇన్నింగ్స్ ల‌లో క‌లిపి 222 పరుగులు చేసిన రిజ్వాన్ ఒక టెస్టు మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన పాక్ వికెట్ కీపర్ గా తస్లిమ్ ఆరిఫ్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక టెస్టు మ్యాచ్ లో  ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు పాక్ వికెట్ కీపర్లు మాత్రమే 200కు పైగా పరుగులు చేయగలిగారు.

పాకిస్థాన్ తరఫున ఒక‌ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్లు 

  • 222 (171* & 51) - మహ్మద్ రిజ్వాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి, 2024
  • 210 (210* & DNB) - తస్లీమ్ ఆరిఫ్ vs ఆస్ట్రేలియా, ఫైసలాబాద్, 1980
  • 209 (209 & 0) - ఇంతియాజ్ అహ్మద్ vs న్యూజిలాండ్, లాహోర్, 1955
  • 197 (150 & 47*) - రషీద్ లతీఫ్ vs వెస్టిండీస్, షార్జా, 2002
  • 196 (78 & 118) -సర్ఫరాజ్ అహ్మద్ vs వెస్టిండీస్, కరాచీ, 2023
     

సూర్యకుమార్ యాదవ్ కోసం కేకేఆర్ మాస్టర్ ప్లాన్.. ముంబై ఏం చేస్తుందో మరి..? 

click me!