హెచ్‌సీఏలో హై డ్రామా... తిరిగి అధ్యక్షుడిగా అజారుద్దీన్‌కి అధికారం, అపెక్స్ కౌన్సిల్‌పై వేటు...

By Chinthakindhi RamuFirst Published Jul 5, 2021, 10:46 AM IST
Highlights

హెచ్‌సీఏ డైరెక్టర్‌గా మహ్మద్ అజారుద్దీన్ ఎన్నిక సరైన రీతిలో జరిగిందని తేల్చిన న్యాయస్థానం...

 ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన జడ్జి...

అపెక్స్ కౌన్సిల్‌పై అనర్హత వేటు విధిస్తూ నిర్ణయం...

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో హై డ్రామా తారా స్థాయికి చేరుకుంది. అపెక్స్ క్యాన్సిల్‌‌ కారణంగా పదవి కోల్పోయిన మహ్మద్ అజారుద్దీన్, తిరిగి హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.

అజారుద్దీన్‌ను పదవి నుంచి సస్పెండ్ చేసిన ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై తాత్కాలిక అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.

హెచ్‌సీఏ నియమ నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై ఆరోపణలు రావడంతో జూన్ 17న ఆయన్ని ఆ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అపెక్స్ కౌన్సిల్. 

తాజాగా జస్టిస్ దీపక్ వర్మ నేతృత్వంలోని కమిటీ... దీనిపై విచారణ జరిపి, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

‘అపెక్స్ కౌన్సిల్ తమ సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సరైన పద్దతిలో ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నా. వారు పంపిన షోకాజ్ నోటీసులు, ఇతరత్రా ఆదేశాలు కానీ చెల్లుబాటు కావు’ అంటూ తెలియచేశారు. 

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తిరిగి నియమిస్తున్నట్టు ప్రకటించిన అంబుడ్సమన్ రిటైర్డ్ జడ్జ్ దీపక్ వర్మ, ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె జాన్ మనోజ్, ఆర్ విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధలపై తాత్కాలికంగా అనర్హత వేటు విధించారు.

click me!