పెళ్లిరోజు కానుకగా భార్యకి సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... సాక్షి టేస్టుకి తగ్గట్టుగా...

Published : Jul 04, 2021, 05:45 PM IST
పెళ్లిరోజు కానుకగా భార్యకి సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... సాక్షి టేస్టుకి తగ్గట్టుగా...

సారాంశం

11వ పెళ్లి రోజు జరుపుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి సింగ్... వివాహ వార్షికోత్సవ కానుకగా వింటేజ్ కారును బహుకరించిన మాహీ...

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి సింగ్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. మూడేళ్లు ప్రేమించుకుని, రెండేళ్లు డేటింగ్ చేసి 2010లో పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 11 ఏళ్లు నిండాయి. 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సాక్షికి ఓ మధురమైన బహుమతి ఇచ్చాడు మాహీ...

మాహీకి కార్లు, బైకులు అంటే మహా ఇష్టం. ఇప్పటికే ధోనీ ఇంట్లో కార్ల కోసం ఓ స్పెషల్ ఫ్లోరే ఉంది. తాజాగా సాక్షి కోసం స్పెషల్‌గా ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు మాహీ... లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కారును యానివర్సరీ కానుకగా ఇచ్చాడంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేసింది సాక్షి సింగ్.

వీరిద్దరికీ జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల జీవాకి ఇన్‌స్టాలో సెపరేట్ అకౌంట్ ఉండడమే కాదు, దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

చెత్త ఆటతో ఆ ఇద్దరిపై వేటు.. వైజాగ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?