వరల్డ్ కప్ నుంచి తప్పించడంపై నోరు విప్పిన హైద్రాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్

By team teluguFirst Published Aug 14, 2020, 11:04 AM IST
Highlights

ఇంగ్లాండ్ తో తలపడ్డ మ్యాచులో టీం ఓటమి చెందడంతో  ఈ విషయంపై ఫాన్స్ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. తనను టీమ్‌ నుంచి తప్పించడంపై మిథాలీ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. 

వెస్టిండీస్ లో జరిగిన 2018 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో  సెమీఫైనల్‌కు ముందు హైదరాబాదీ‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను టీం ఇండియా తుది జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అది అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది కూడా. 

ఇంగ్లాండ్ తో తలపడ్డ మ్యాచులో టీం ఓటమి చెందడంతో  ఈ విషయంపై ఫాన్స్ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. తనను టీమ్‌ నుంచి తప్పించడంపై మిథాలీ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. 

అప్పటి కోచ్‌ రమేష్‌ పొవార్‌, బీసీసీఐ కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ లపై తన కెరీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నారని నిప్పులు చెరిగింది. అయితే, ఆనాటి చేదు జ్ఞాపకాలను మరోసారి మిథాలీ రాజ్ గుర్తు చేసుకుంది. 

స్టార్ స్పోర్ట్స్ 1 నిర్వహిస్తున్న షో లో ఈ విషయం పై మరోమారు మాట్లాడింది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.... .తుది జట్టు నుంచి తప్పించడంతో తీవ్ర నిరాశకు లోనయ్యానని కానీ, అలా జరిగింది తనకొక్క దానికే కాదుకదా అంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది. క్రీడాకారుల జీవితంలో ఇలాంటివి సహజం అని తెలిపింది. 

జట్టు కూర్పులో భాగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, తన కంటే మెరుగైన ప్లేయర్లు ఉన్నారని కెప్టెన్‌, కోచ్‌ భావించి ఉండబట్టే తనను తప్పించి ఉంటారని మిథాలీ వ్యాఖ్యానించింది. 

ఒకవేళ సెమీ్‌సలో టీమిండియా నెగ్గి ఉంటే.. ఫైనల్లో తనకు ఆడే అవకాశం దక్కి ఉండేదేమో అనే సానుకూల వ్యాఖ్యలు చేసింది. తనను టీం సెమిస్ లో నెగ్గి అతను ఫైనల్ లో ఆది ఉంది ఉంటే.... తాను అప్పుడు టీం ఇండియా ను విజేతగా నిలిపేందుకు శాయశక్తులా పోరాడే దానినని తెలిపింది మిథాలీ. 

ఇకపోతే.... మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ నిర్మితమవుతున్న విషయం తెలిసిందే.  ఇందులో బాలీవుడ్‌ నటి తాప్సీ మిథాలీ పాత్రలో కనిపించబోతుంది. చిత్రం కోసం తాప్సికి శిక్షణ ఇస్తున్న విషయాన్నీ తెలిపింది మిథాలీ. 

తాప్సి ఫేమస్ క్రికెటింగ్ షాట్ కవర్‌ డ్రైవ్‌ ను ఆడడంలో ఇబ్బందులు పడుతుందని, వాటిని సమర్థవంతంగా ఎలా ఆడాలో తాప్సికి శిక్షణ ఇస్తున్నట్టుగా చెప్పింది. 

click me!